
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురం బంగారు తాపడం పనులకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి రూ. 3 కోట్ల 64 వేలు అందించారు. రెండవ విడతగా మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో మొత్తం రూ.84,29,880 నగదు, రూ.2,16,35,042 విలువ చేసే చెక్కులు, 200 గ్రాముల బంగారాన్ని బాలాలయంలో ఆలయ ఈవో గీతారెడ్డికి సోమవారం అందజేశారు. మొదటి విడతగా గత నెల 28వ తేదీన రూ.1.83 కోట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. మరో వారం, పది రోజు ల్లో 11 కిలోల బంగారానికి అవసరమయ్యే నగదును అందజేస్తామని వెల్లడించారు.