
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం శ్రీస్వామి వారు గోవర్ధనగిరిధారి అలంకార సేవలో, సాయంత్రం సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానార్చకుడు నల్లంధీఘల్ లక్ష్మీనరసింహచార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం, పారాయణికులు, రుత్వికులు వేదపారాయణం పఠించారు.
Comments
Please login to add a commentAdd a comment