govardhanagiri
-
గోవర్ధనగిరిధారిగా శ్రీలక్ష్మీనరసింహస్వామి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం శ్రీస్వామి వారు గోవర్ధనగిరిధారి అలంకార సేవలో, సాయంత్రం సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానార్చకుడు నల్లంధీఘల్ లక్ష్మీనరసింహచార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం, పారాయణికులు, రుత్వికులు వేదపారాయణం పఠించారు. -
ఆన్లైన్లో అమ్మకానికి శ్రీకృష్ణుడి గోవర్ధన శిలలు
లక్నో : ద్వాపర యుగంలో చిన్ని కృష్ణుడు తన చిటికెన వేలితో ఎత్తిన గోవర్ధన పర్వతానికి సంబంధించిన శిలలను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన ముగ్గురిపై ఎఫ్ఆర్ఐ నమోదైంది. ఇండియా మార్ట్ సీఈఓ దినేష్ అగర్వాల్, అతడి సోదరుడు బ్రిజేశ్, మరో వ్యక్తి అంకుల్ అగర్వాల్‌పై లక్నోలోని మధుర ప్రాంతానికి చెందిన ప్రజలు కేసు పెట్టారు. ఆదివారం పెద్ద సంఖ్యలో గోవర్ధన్ పోలీస్ట్ స్టేషన్ వద్దకు చేరుకున్న గ్రామస్తులు, సాధువులు సదరు కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గిరిరాజ్ జీ’ (గోవర్ధన పర్వతం) హిందువుల నమ్మకానికి సంబంధించినదని, ఇండియా మార్ట్ గోవర్ధన పర్వత శిలలను అమ్మటానికి వీల్లేదని స్పష్టం చేశారు. వెంటనే గోవర్ధన శిలల అమ్మకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఇండియా మార్ట్ ఒక్కో శిలను రూ. 5,175 విక్రయిస్తోంది. ( పోర్న్ రాకెట్: వాళ్లే ఈ నటి టార్గెట్! ) ద్వారపయుగంలో గోకులం వాసులు నిరంతరం శ్రీకృష్ణుని తలచుకుంటుండగా ఇంద్రుడు మదగర్వంతో భారీ వర్షాలు కురిపిస్తాడు. ఆ సమయంలో శ్రీ కృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్ధన గిరి పర్వతాన్ని ఎత్తి గోవులను , గోకులం వాసులను కాపాడుతాడు. అప్పుడు ఇంద్రుడు తన తప్పులను తెలుసుకుని జగన్నాటకుడైన శ్రీ కృష్ణుడిని శరణు వేడుకుంటాడు. చదవండి : కేటుగాళ్ల చేతిలో మోసపోయిన సీఎం కూతురు -
వరంగల్ జిల్లాలో ఆదిమానవుల ఆనవాళ్లు
రఘునాథపల్లి: వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలంలోని గోవర్దనగిరిలోని గోపాలస్వామి గుట్టపై ఆది మానవులు నివసించిన ఆనవాళ్లను జనగామ చరిత్ర పరిశోధకుడు ఆర్ రత్నాకర్‌రెడ్డి సేకరించారు. మూడేళ్లుగా జనగామ చుట్టుపక్కల గ్రామాల్లో పురావస్తు చరిత్ర పరిశోదన చేస్తున్న ఆయన శుక్రవారం గోపాలస్వామి గుట్టపై నవీన శిలా యుగానికి చెందిన పలు ఆధారాలను విలేకరుల సమావేశంలో వివరించారు. గుట్ట చుట్టూరా 100 ఎకరాల్లో అక్కడక్కడ డోల్మన్లు, పిస్తులు రకపు సమాధులతోపాటు పాటిగడ్డ ఉందని, అక్కడ వృత్తాకారంలో అమర్చిన రాతి గుండ్ల మధ్య ఆ కాలానికి చెందిన శవాలను పూడ్చి వేసినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. అక్కడ రాతి గొడ్డళ్లు, నూరుడు రాళ్లు, బాణం గుర్తులాంటి సూక్ష్మ పరి కరాలు, దంపుడు, నూరుడు రాళ్లు, మృణ్మయ పాత్ర లు, నిప్పులు రగిలించే చెకుముకి రాళ్లు ఉన్నాయని చెప్పారు. గుట్టపై శివాల యం ఉందని, సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్పారు. క్రీ.పూ 500 సంవత్సరంలో ఆదిమానవులు నివసించినట్లు ఆనవాళ్లు కన్పిస్తున్నందున ప్రభుత్వం ఇక్కడి చరిత్రను భద్రపరిచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరారు.