ఆన్‌లైన్ అమ్మకానికి ఉంచిన గోవర్ధన శిల
లక్నో : ద్వాపర యుగంలో చిన్ని కృష్ణుడు తన చిటికెన వేలితో ఎత్తిన గోవర్ధన పర్వతానికి సంబంధించిన శిలలను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన ముగ్గురిపై ఎఫ్‌ఆర్‌ఐ నమోదైంది. ఇండియా మార్ట్ సీఈఓ దినేష్ అగర్వాల్, అతడి సోదరుడు బ్రిజేశ్, మరో వ్యక్తి అంకుల్ అగర్వాల్‌పై లక్నోలోని మధుర ప్రాంతానికి చెందిన ప్రజలు కేసు పెట్టారు. ఆదివారం పెద్ద సంఖ్యలో గోవర్ధన్ పోలీస్ట్ స్టేషన్ వద్దకు చేరుకున్న గ్రామస్తులు, సాధువులు సదరు కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గిరిరాజ్ జీ’ (గోవర్ధన పర్వతం) హిందువుల నమ్మకానికి సంబంధించినదని, ఇండియా మార్ట్ గోవర్ధన పర్వత శిలలను అమ్మటానికి వీల్లేదని స్పష్టం చేశారు. వెంటనే గోవర్ధన శిలల అమ్మకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఇండియా మార్ట్ ఒక్కో శిలను రూ. 5,175 విక్రయిస్తోంది. ( పోర్న్ రాకెట్: వాళ్లే ఈ నటి టార్గెట్! )
ద్వారపయుగంలో గోకులం వాసులు నిరంతరం శ్రీకృష్ణుని తలచుకుంటుండగా ఇంద్రుడు మదగర్వంతో భారీ వర్షాలు కురిపిస్తాడు. ఆ సమయంలో శ్రీ కృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్ధన గిరి పర్వతాన్ని ఎత్తి గోవులను , గోకులం వాసులను కాపాడుతాడు. అప్పుడు ఇంద్రుడు తన తప్పులను తెలుసుకుని జగన్నాటకుడైన శ్రీ కృష్ణుడిని శరణు వేడుకుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment