క్యూ కాంప్లెక్స్‌లో నిండిన భక్తులు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది. కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో భక్తులు అధికసంఖ్యలో శ్రీస్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చారు. దీంతో శ్రీస్వామివారికి రికార్డుస్థాయిలో నిత్యాదాయం సమకూరింది. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాదం విక్రయశాల వంటి ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి.
ధర్మదర్శనానికి 4 గంటలకుపైగా, వీఐపీ దర్శ నానికి రెండున్నర గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. శ్రీసత్యనారాయణస్వామి వ్రతాల కోసం భక్తులు బారులుదీరి కనిపించారు. వివిధ పూజలతో శ్రీస్వామి వారికి రూ.1,16,13,977 ఆదాయం వచ్చింది. ప్రధా న బుకింగ్‌తో రూ.3,24,650, కైంకర్యాలు రూ. 16,100, సుప్రభాతం రూ.10,300, వ్రతాలు రూ.15,20,000, ప్రచార శాఖ రూ.2,87,500, వీఐపీ దర్శనం రూ.18,90,000, యాదరుషి నిలయం రూ.1,92,500, ప్రసాద విక్రయం రూ.44,37,150, పాతగుట్ట ఆలయం రూ.3,78,670, కల్యాణ కట్ట రూ.1,78,000, శాశ్వతపూజలు రూ.37,500, వాహన పూజలు రూ.31,200, కొండపైకి వాహనాల ప్రవేశం రూ.9,75,000, సువర్ణ పుష్పార్చన రూ.2,52, 348, వేద ఆశీర్వచనం రూ.19,800, శివాల యం రూ.32,600, అన్నదానం రూ.55,659, బ్రేక్ దర్శనాలు రూ.9,75,000 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీస్వామి వారి నిత్య ఆదాయం గత ఆదివారం రూ.1.09 కోట్లు రాగా, ఈ ఆదివారం అదనంగా రూ.6,31,531 ఆదాయం వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment