ఇరవై నాలుగు ముద్దులు! | Director Ayodhyakumar about Sri Lakshmi & 24 Kisses Movie | Sakshi
Sakshi News home page

ఇరవై నాలుగు ముద్దులు!

Published Tue, Jun 21 2016 11:05 PM | Last Updated on Tue, Nov 6 2018 5:47 PM

ఇరవై నాలుగు ముద్దులు! - Sakshi

ఇరవై నాలుగు ముద్దులు!

‘మిణుగురులు’ వంటి విలక్షణమైన చిత్రానికి దర్శకత్వం వహించిన అయోధ్యకుమార్ ‘శ్రీలక్ష్మి అండ్ 24 కిస్సెస్’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. ఈ చిత్రవిశేషాలను అయోధ్యకుమార్ చెబుతూ - ‘‘ఇదొక యునిక్ లవ్‌స్టోరీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్. టైటిల్ కొంచెం హార్డ్‌గా ఉన్నా, కథలో స్వచ్ఛమైన ప్రేమకథ ఉంటుంది.
 
ఇప్పటి వరకు తెలుగులో ఇటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం రాలేదు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. జులైలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. ప్రముఖ హీరో, హీరోయిన్ నటించనున్న ఈ చిత్రాన్ని ఓ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించనుంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement