మరో పది రోజులే... | Telangana famous temple in yudagirigutta Sri lakshminarasimhaswami | Sakshi
Sakshi News home page

మరో పది రోజులే...

Published Sat, Apr 9 2016 10:49 PM | Last Updated on Tue, Nov 6 2018 5:47 PM

మరో పది రోజులే... - Sakshi

మరో పది రోజులే...

తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతోన్న యూదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వయంభు....

తర్వాత ఏడాదిన్నర ఆగాల్సిందే

యాదగిరికొండ (నల్లగొండ): తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతోన్న యూదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వయంభు మూర్తులను భక్తులు దర్శించుకునేది ఇక 10 రోజులు మాత్రమే. ఈ నెల 21వ తేదీన బాల ఆలయంలో విగ్రహ మూర్తులను చిన జీయర్ స్వామి ప్రతిష్ఠిస్తారు. ఆ తరువాత బాల ఆలయంలోనే భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు. దీంతో యాదాద్రికి వచ్చే భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి మరీ పోటీ పడుతున్నారు.

ఈ పది రోజులు దాటిందంటే దేవస్థానంలోనే స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలంటే భక్తులు ఏడాదిన్నర ఆగాల్సిందే. మరోవైపు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దీక్షలు (నరసింహ మాలధారణ) సోమవారం నుంచి ప్రారంభం కానున్నారుు. స్వామి వారి జయంతి వచ్చేనెల 20 వ తేదీన ఉండడంతో మండల దీక్ష చేపట్టే స్వాములు ఈ నెల 11న, అర మండల దీక్ష తీసుకునే స్వాములు మే 1న మలధారణ చేయూలని ఆలయ అర్చకులు సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement