
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో త్వరలోనే మరో అద్భుతమైన వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానా ర్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు వెల్లడించారు. శుక్రవారం ఆయన ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో మాట్లాడుతూ త్వరలోనే ఆలయంలో కోటి పుష్పార్చన వేడుకను జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
త్వరలోనే వేడుక తేదీలను ప్రకటిస్తామన్నారు. అంతే కాకుండా కోటి పుష్పార్చన వేడుక ముగిసిన వెంటనే వేయి యజ్ఞ గుండాలతో లోక కల్యాణార్థమైన లక్ష్మీనరసింహ సహస్ర కుండాత్మక మహాయాగం నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment