
అష్టభుజి ప్రాకార మండపం నుంచి దర్శనానికి వెళ్తున్న భక్తులు
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో పంచనారసింహులను దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చారు. కొండపైన క్యూ కాంప్లెక్స్ భక్తులతో నిండిపోయింది. దీంతో స్వామి వారి దర్శనానికి సుమారు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. 30 వేల మందికి పైగా భక్తులు రావడంతో క్యూలైన్లు నిండుగా కనిపించాయి.