యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరో బంగారు సింహాసనం వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు దీన్ని బహూకరించాడు. ముఖ మండపంలోని ఉత్సవమూర్తుల కోసం ఇప్పటికే ఒక బంగారు సింహాసనాన్ని ఓ భక్తుడు అందజేశారు. తాజాగా మరో సింహాసనాన్ని దాత ఇచ్చాడు.
ఈ సింహాసనం విలువ ఎంత ఉంటుంది, ఎంత బంగారం పట్టిందనే అంశాలను అధికారులు తెలియనివ్వడం లేదు. ప్రస్తుతం ఈ సింహాసనాన్ని ఆలయ ముఖ మండపంలో భద్రపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment