Cultural festivals
-
యాదాద్రిలో వైభవంగా సాంస్కృతికోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7గంటలకు సాంస్కృతికోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యా యి. తూర్పు రాజగోపురం వద్ద ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో 100 మంది కళాకారులు కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. అనంతరం టి.కే.సిస్టర్స్ కర్నాటక గాత్ర కచేరీ నిర్వహించారు. శ్రీసాయి బృందం మోర్సింగ్ వాయిద్య కచేరి భక్తులను ఆకట్టుకుంది. వేడుకల్లో వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి పాల్గొన్నారు. -
హైదరాబాద్:: జాతీయ సంస్కృతీ మహోత్సవంలో సినీనటుడు చిరంజీవి (ఫొటోలు)
-
ఈ ఉత్సవాలు.. రాజకీయాలకు అతీతం
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాజకీయాలకతీతంగా తెలంగాణలోని ప్రతి జిల్లాలో రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవాలను నిర్వహిస్తామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. మన భాషలు వేరైనా అంతా భారతీయులుగా ఉన్నామని, భిన్నత్వంలో ఏకత్వం చాటేందుకే సంస్కృతీ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రెండురోజుల పాటు నిర్వహించిన జాతీయ సంస్కృతీ మహోత్సవాల ముగింపు సమావేశం బుధవారం రాత్రి జరిగింది. కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళా ప్రదర్శనలను తిలకించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. జూన్ 21 జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. ప్రధాని మోదీ నేతృత్వంలో రామప్పను అభివృద్ధి చేసే పనులు రెండు మూడు మాసాల్లో ప్రారంభిస్తామని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్‌లో రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవం నిర్వహిస్తున్నామని, దానికి సీఎం కేసీఆర్‌తో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్, మంత్రులకు ఆహ్వానం పంపిస్తామని, అందరూ హాజరవుతారని తెలిపారు. మాజీ ఎంపీ, సాంస్కృతిక రాయబారి విజయశాంతి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో నిర్వహించాలని కోరారు. సినీ గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ‘ఒసేయ్ రాములమ్మ’లోని పాట పాడి విజయశాంతిని సినిమాలోని డైలాగ్ చెప్పాలని కోరగా.. ‘దొరా.. నీ కాళ్లు మొక్కం.. తల దించుకోం..’అని చెప్పడంతో, సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి డైలాగ్ చెప్పినట్లుందంటూ చప్పట్లు కొట్టారు. ఘల్లుమన్న ఓరుగల్లు: రాగం, తాళం, గానం, నృత్యంతో ఓరుగల్లు ఘల్లుమంది. సంస్కృతీ మహోత్సవ్‌లో భాగంగా దేశప్రజల జీవన విధానం, ఆచార సంప్రదాయాలు, వేషధారణలు ప్రతిబింబించేలా కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ మహోత్సవానికి బుధవారం కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు హాజరుకాలేదు. -
రాజమండ్రిలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం
రాజమండ్రి(తూ.గో): రాజమండ్రి ఆర్ట్ కళాశాల మైదానంలో రెండురోజుల పాటు జరుగనున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలు హాజరయ్యారు. గవర్నర్, కేంద్ర మంత్రి తో పాటు జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు రాష్ట్ర మంత్రులు వేణుగోపాల కృష్ణ, అవంతి శ్రీనివాస్‌లు హాజరయ్యారు. జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను గవర్నర్ బిశ్వభూషణ్ ప్రారంభించారు. దీనిలో భాగంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలు మన సంస్కృతి, సంప్రదాయాలను మరింత ఇనుమడింప జేస్తాయని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కేంద్ర సాంస్కృతిక శాఖ అనేక రకాల ఉత్సవాలను నిర్వహిస్తోందని, దేశ ప్రజల్లో జాతీయతను పెంపొందించడానికి ఈ ఉత్సవాలు తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజల్లో జాతీయతా భావాన్ని పెంపొందించిన నేతల్లో సుభాష్ చంద్రబోస్ ఒకరని కొనియాడారు. కాగా, దేశ మహోన్నత సంస్కృతి, సాంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా జరగనున్న ఈ వేడుకల్లో తేట తెలుగు సంస్కృతి, కళల కనువిందు, పలు రకాల ప్రసిద్ధ వంటకాల ప్రదర్శన జరగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల సంస్కృతి వైభవం, విశిష్టతను చాటిచెప్పే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. -
ఎస్ఆర్ఎం వర్సిటీలో సాంస్కృతికోత్సవాలు
చెన్నై: నగరంలోని ఎస్ఆర్ఎం డీమ్డ్ యూనివర్సిటీలో మిలన్–2018 పేరుతో సాంస్కృతికోత్సవాలు బుధవారం ఘనంగా మొదలయ్యాయి. ఈ వేడుకల ప్రారంభ కార్యక్రమానికి అర్జున్ రెడ్డి చిత్ర హీరో విజయ్ దేవరకొండతోపాటు ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ వ్యవస్థాపక చాన్స్‌లర్ టీఆర్ పారివేందర్, వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ తదితరులు హాజరయ్యారు. మొత్తం ఐదు రోజులపాటు సాంస్కృతికోత్సవాలు జరగనుండగా తొలిరోజు దాదాపు 6,000 మంది వచ్చారనీ, వేడుకల్లో పాల్గొనేందుకు ఐదు ఖండాల్లోని 40 దేశాల నుంచి విద్యారంగ ప్రముఖులు ఇక్కడకు రానున్నారని నిర్వాహకులు తెలిపారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి మొత్తంగా రూ.15 లక్షల నగదును ఇవ్వనున్నట్లు చెప్పారు. -
మా హయాంలోనే అది సాధ్యం..
మా హయాంలోనే అది సాధ్యం సమైక్య రాష్ట్రంలో తెలంగాణ యాస, భాష వివక్షతకు గురయ్యాయి..ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శ్రీరంగాపురంలో తెలుగు సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలు హాజరైన బుర్రా వెంకటేశం, కలెక్టర్లు, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలో పాల్గొన్న కవులు, కళాకారులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగిన కార్యక్రమాలు. సాక్షి వనపర్తి: మనిషిలో కలిగే ఆలోచనను ఇతరులకు తెలియజేసేదే భాష అని అలాంటి తెలుగు భాషకు తెలంగాణ రాష్ట్రం పట్టం కట్టిందని రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం వనపర్తి జిల్లా శ్రీరంగాపురం లోని రంగనాథస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన తెలుగు సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు–2017 ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కొన్నేళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో భాషా పండితుల నియామకాలే జరుగలేదని, భాషా కళాశాలల ప్రారంభానికి కూడా నోచుకోలేదని అన్నా రు. ఇటీవల ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగుభాషను కాపాడేందుకు త్వర లోనే భాషా పండితుల నియామకం, కళాశాలల ప్రారంభం చేపట్టనున్నామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించినట్లు నిరంజన్‌రెడ్డి తెలిపారు. 12వ తరగతి వరకు తెలుగు అంశాన్ని తప్పనిసరిగా చేర్చుతున్నట్లు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించడం హర్షణీయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాష, యాసను విలన్లు, జోకర్ల పాత్రల ద్వారా కించపరిచారని, ఇతరుల భాష ను వ్యతిరేకించరాదని అన్నారు. తెలుగుభాష పేరుతో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలను ఒక్కటిగా చేసి 60ఏళ్ల పాటు తెలంగాణ భాష, యాస, ప్రజలను అణిచివేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమం భాష, యాస, నిధులు, నీళ్లు, కొలువుల కోసమే జరిగిందని ఆయన తెలిపారు. 1969లో మొదలైన తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ వచ్చే వరకు కాపాడింది కవులు, కళాకారులేనని, వారి పాటే కోట్లాది మంది ప్రజలను కదిలించిం దని నిరంజన్‌రెడ్డి తెలిపారు. తెలుగు సాహిత్య సాం స్కృతిక సభల సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి సాయిచంద్ బృందం పాడిన పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థు లు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు తెలుగుభాష గొప్పతనాన్ని చాటాయి. కార్యక్రమంలో డీఆర్ఓ చంద్ర య్య, ఆర్డీఓ చంద్రారెడ్డి, డీఆర్డీఓ గణేష్, డీపీఓ వీరబుచ్చయ్య, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, పలువురు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరంగాపూర్‌కు గొప్ప విశిష్టత ఉమ్మడి రాష్ట్రంలో మన భాషకు అవమానం జరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉం డే జిల్లాల్లో ఉర్దూ యాస ఉండడం వల్ల ఇతరులు అవమానించేవారు. తెలుగు భాషాభివృద్ధికి, సంస్కృతికి శ్రీరంగాపూర్ ఎంతో గొప్పది. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన తెలుగు మహాసభలకు 42దేశాల నుంచి ప్రతినిధులు రావడం గర్వించదగ్గ విషయం. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి వనపర్తి మొదటి ఎమ్మెల్యే కావడం మా అందరి అదృష్టం. పర్యాటక కేంద్రంగా శ్రీరంగాపూర్ అభివృద్ధి చెందాలంటే రంగసముద్రం రిజర్వాయర్‌లో బోటింగ్ ఏర్పాటు చేయాలి. – చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తెలుగుభాష గొప్పది తెలుగుభాష ఎంతో గొప్పది. ప్రభుత్వం తెలుగు మహాసభల ద్వారా భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటింది. మన జిల్లాలో కూడా ఘనంగా తెలుగు మహాసభలు నిర్వహించుకోవడం సంతోషకరమైన విషయం. జిల్లాలోని కవులు, కళాకారులను సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. – శ్వేతమహంతి, కలెక్టర్, వనపర్తి జిల్లా తెలుగు తల్లిలాంటిది తెలుగుభాష కన్నతల్లి లాంటిది. మాతృభాషలో మాట్లాడితే పొందే మాధుర్యం మరేభాషకు దక్కదు. దక్షిణాది రాష్ట్రాలలో తెలుగుభాషకు ఎంతో గొప్ప పేరుంది. ఈ ప్రాంతంలో తెలుగు మహాసభలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. -రోహిణి ప్రయదర్శిని, ఎస్పీ, వనపర్తి జిల్లా -
నగరంలో తెలంగాణ– కేరళ సాంస్కృతిక ఉత్సవం
25 నుంచి మూడు రోజులపాటు భారీ సమ్మేళనం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ– కేరళ ప్రభుత్వాలు సంయుక్తంగా నగరంలో పైత్రుకోత్సవం పేరుతో సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ నెల 25 నుంచి 3 రోజులపాటు నాంపల్లి తెలుగు లలితకళాతోరణంలో ఈ కార్యక్రమాలుంటాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ తెలుగు రీజియన్ మలయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ, కేరళ సాంస్కృతిక, పురావస్తు, రాజ్యాభిలేఖన శాఖలు దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. రెండు రాష్ట్రాల నృత్య విన్యాసాలు, సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, విద్యార్థు లకు చిత్రలేఖనం, క్విజ్ పోటీలు, సంప్రదాయ వంటకాల ఘుమఘుమలు, పురస్కారాలు పొం దిన మలయాళీ చలనచిత్ర ప్రదర్శనలు... ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు కార్యక్రమాలు ఉంటాయి. గెలుపొందిన వారికి ఉచితంగా కేరళ పర్యటన అవకాశాలు కూడా వరిస్తాయి. ఈ వివరాలను బుధవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పర్యాటకశాఖ మంత్రి చందూలాల్, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంలు వివరించారు. ఈ ఉత్సవాల్లో ప్రదర్శన కోసం కేరళ నుంచి భారీ సంఖ్యలో కళాకారుల బృందం నగరానికి వస్తోందని తెలిపారు. కేరళ ప్రభుత్వంతో కలసి ఇలాంటి భారీ సాంస్కృతికోత్సవాలను నిర్వహించటం ఇదే తొలిసారన్నారు. ఉత్సవాల అనంతరం తెలంగాణ కళాకారుల బృం దం కేరళకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తుందన్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్ కళాకారుల బృందం రాష్ట్రంలో పర్యటించి ఇచ్చిన ప్రదర్శనలకు మంచి స్పందన వచ్చిందని, మరిన్ని రాష్ట్రాల బృందాలు తెలంగాణకు రావటానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు. త్వరలో కశ్మీర్‌కు తెలంగాణ బృందాలు త్వరలో తెలంగాణ బృందాలు కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తాయన్నారు. కేరళకు విదేశీ పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నందున వారిలో కనీసం 20 శాతం మందిని తెలంగాణకు మళ్లించగలిగితే విదేశీ పర్యాటకుల సంఖ్య సులభంగా 10 లక్షలకు చేరుకుం టుందని వెంకటేశం చెప్పారు. ఈ దిశగా విజయం సాధించేందుకు ఈ ఉత్సవాలు దోహదం చేస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాంస్కృతిక సంచాలకులు హరికృష్ణ, కాన్ఫెడరేషన్ ఆఫ్ తెలుగు మలయాళీ అసోసియేషన్స్ అధ్యక్షులు బెంజిమన్‌లు కూడా పాల్గొన్నారు. -
ఆకాశంలో అద్భుతం
నేటి నుంచి ‘స్కై ఫెస్ట్’ ప్రారంభం ఐదు రోజుల సాంస్కృతిక సంబరాలు సెంట్రల్ యూనివర్సిటీ: రెక్కలు కట్టుకుని పక్షిలా గాలిలో తేలిపోతుంటే.. ఆ అనుభూతిని పొందాల్సిందే.. లేదంటే ప్రత్యక్షంగా చూడాల్సిందే.. ఇప్పుడు ఈ అవకాశం నగరవాసి ముంగిటకొచ్చింది. గాలిలో తేలుతూ ఆనందడోలికల్లో ముంచేందుకు సిటీ ‘స్కై ఫెస్ట్-2015’కు సిద్ధమైంది. ఈ వేడుక బుధవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రారంభం కానుంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ గగన పండుగ ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. క్యాన్సర్ బాధితులకు సాయం అందించేందుకు బంజారాహిల్స్ రోటరీక్లబ్ ఈ కార్యక్రమానికి నడుం బిగించింది. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 12 గంటల వరకు పారాజంపింగ్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్, సినిమాలు, సంగీత ఝరితో ఈ స్కైఫెస్ట్ నగరవాసులకు కొత్త అనుభూతిని పంచనుంది. కార్యక్రమాలు ఇవే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఆకాశగంగ బృందం ప్రదర్శించే పారా జంపింగ్, వాయు విన్యాసాలు ఈ ఫెస్ట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్‌లో లాంగ్‌రైడ్, జాయ్ రైడ్ ఉంటాయి. కార్నివాల్లో ఆక్రోబాట్స్ డాన్సులు, హిప్హప్ జంపింగ్ రోప్, సల్సా, స్టిక్ డాన్సులు ప్రత్యేక ఆకర్షణ. ఇంకా రాక్‌బాండ్ ప్రదర్శనలు, ఆరుబయట చిత్రాలు అలరిస్తాయి. తొలిరోజు డీజే అఖిల్ ప్రత్యేక రాక్నైట్ హోరెత్తనుంది. 24న బాద్షా, 25న దేవి శ్రీ ప్రసాద్, 26న సోను నిగమ్, 27న తీన్మార్ నైట్ పేరిట ఆర్పీ పట్నాయక్ సంగీత ప్రదర్శనలు స్కైఫెస్ట్ జోష్‌ను పెంచనున్నాయి. ఇవిగాక చక్కని చిత్రాలను వేలమంది ఆరుబయట తిలకించే అద్భుత అవకాశం ఇందులో ఉంది. నగరంలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ స్కైఫెస్ట్ నగరవాసులకు న్యూ ఇయర్ జోష్‌ను మోసుకొస్తుందని ఫెస్ట్ నిర్వాహకులు జగదీశ్ రామడుగు, రాణిరెడ్డి, రామ్మోహనరావు తెలిపారు. వేడుక ద్వారా సమకూరిన మొత్తాన్ని ‘స్పర్శ్ హో స్పైస్’ ఆస్పత్రికి అందించి క్యాన్సర్ బాధితులకు స్వాంతన చేకూర్చనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమానికి ‘సాక్షి’ మీడియా భాగస్వామిగా వ్యవహరిస్తుంది. -
ఆటో డ్రైవర్ దారుణ హత్య
ప్రాణం తీసిన పగ ! మేకలు కోసే కత్తితో దాడి అయిదుగురిపై కేసు నిందితులు పరార్ రాత్రి పది గంటలు.. గ్రామంలో జాతర జరుగుతోంది. సాంస్కృతిక సంబరాలతో ఊరంతా ఎంతో సందడిగా ఉంది. జనం కిక్కిరిసి ఉన్నారు. అలాంటి సమయంలో ఓ జులాయి రోడ్డుకు అడ్డంగా బైక్ పెట్టాడు. అదే విషయాన్ని ప్రశ్నించిన ఓ ఆటో డ్రైవర్‌ను కత్తితో మెడపై పొడిచేశాడు. అడ్డుకున్న వ్యక్తినీ గాయపరిచాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన పాయకరావుపేట మండలం రామభద్రపురంలో చోటుచేసుకుంది. పాయకరావుపేట : మండలంలోని పెదరామభద్రపురంలో ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. మరో వ్యక్తి కత్తిపోటుకు గురయ్యా డు. యలమంచిలి సీఐ సీహెచ్ మల్లేశ్వరరావు, బాధితుల కథనం ప్రకారం.. పెద రామ భద్రపురంలో ఆదివారం మరిడమ్మ జాత ర జరిగింది. రాత్రి పది గంటల సమయంలో వినాయకుని గుడి సెంటల్లో గ్రామానికి చెంది న నారపురెడ్డి సతీష్ తన అనుచరులతో మోటార్‌సైకిల్‌పై వచ్చి రోడ్డుకు అడ్డుగా బండి ఆపా డు. అడ్డుగా పెట్టావేంటని ప్రశ్నించిన వారితో గొడవకు దిగాడు. ఇదే సమయంలో గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తాడి సత్తిబాబు (35) కూడా మోటర్ సైకిల్‌పై వెళ్తూ .. ‘రోడ్డుకు అడ్డు గా బండి పెట్టడం వల్ల ఇబ్బందిగా ఉంద’ని చెప్పాడు. దీంతో వివాదం మొదలైంది. గొడవ పెరగడంతో నారపురెడ్డి సతీష్ తన మోటార్ సైకిల్లో దాచిన కత్తిని తీసి ఆటో డ్రైవర్ తాడి సత్తిబాబు మెడపై పొడిచాడు. దీంతో అతడు తీవ్ర రక్తస్రావమై పడిపోయాడు. సమీపంలోనే ఉన్న సత్తి బాబు చిన్నాన్న కుమారుడు తాడి జయప్రసాద్ అడుక్డునే ప్రయత్నం చేశాడు. సతీష్ అతడి ఛాతిపైనా కత్తితో పొడిచాడు. ప్రసాద్ తప్పించుకుని వెళ్లి బంధువులకు సమాచారం అందించాడు. వారు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి తాడి సత్తిబాబు తీవ్ర రక్తస్రావమై పడి ఉండగా వెంటనే తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు కాకినాడ జనరల్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడికి తీసుకువెళ్లగా విశాఖ కేజీహెచ్‌కు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. కాకినాడ నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో సత్తిబాబు మృతి చెందాడు. గాయపడ్డ తాడి జయప్రసాద్ తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల దర్యాప్తు : సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ సిహెచ్ హరికృష్ణ గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. యలమంచిలి సీఐ హెచ్. మల్లేశ్వరరావు కూడా సంఘటనా స్థలాన్ని పరి శీలించి మృతుని బంధువులు, గ్రామస్తుల నుం చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి కేసు దర్యాప్తు చేస్తున్నా రు. ఈ హత్య కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి నక్కిన గోవిందు ఫిర్యాదు మేరకు నిందితుడు నారపురెడ్డి సతీష్‌తోపాటు నారపుపురెడ్డి అప్పాజి, నారపురెడ్డి రమణ, నారపురెడ్డి కృష్ణ, కొల్లాటి బాబ్జిలపై కేసు నమోదు చేశారు. పథకం ప్రకారమే హత్య ఆటో డ్రైవర్ సత్తిబాబును పథకం ప్రకారమే హత్య చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. 4 రోజుల క్రితం రామకోవెల ప్రాంతంలో గ్రామానికి చెందిన వ్యక్తి సత్తిబాబు హత్యకు పథకం వేశాడని మృతుని సోదరుడు తాడి బాబురావు చెప్పారు. మేకలను కోసి చర్మం తీసే కత్తులను ఉపయోగించి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మృతుడు ఆటో డ్రైవర్ సత్తిబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె మృతదేహం వద్ద విలపించిన తీరు గ్రామస్తులను కంటతడిపెట్టించింది. మితిమీరిన సతీష్ ఆగడాలు! రామభద్రపురానికి చెందిన నారపురెడ్డి సతీష్ జులాయిగా తిరుగుతూ కొంతకాలంగా గ్రామస్తులపై దాడులకు దిగి భయాందోళనలకు గురి చేస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. తప్పతాగి పెద్ద చిన్నా తారతమ్యం లేకుండా విచాక్షణారహితంగా కొట్టడం వంటి చర్యలు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల అంగన్వాడీ సిబ్బందిపైనా దాడి చేసినట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎవ్వరూ సాహసించకపోవడంతో హత్యకు తెగబడ్డాడని పేర్కొంటున్నారు. గతంలో వీరిద్దరి మధ్య చిన్నచిన్న తగాదాలున్నట్లు పేర్కొంటున్నారు.