
సీఎం కేసీఆర్ ముందుగా స్వామివారి పూజలో పాల్గొన్నారు. అనంతరం దేవాలయ అధికారులతో సీఎం.. సమావేశం నిర్వహించనున్నారు.
సాక్షి, యాదగిరిగుట్ట: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) యాదాద్రికి చేరుకున్నారు. ప్రధానాలయంతో పాటు కొండపైన, కొండకింద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించనున్నారు. హెలికాప్టర్‌లో ఉదయం 11.30 గంటల సమయంలో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా స్వామివారి పూజలో పాల్గొన్నారు. అనంతరం దేవాలయ అధికారులతో సీఎం.. సమావేశం నిర్వహించనున్నారు. యాదాద్రి ఆలయ పనులపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. యాదాద్రి ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి.
చదవండి:
సీఎం కేసీఆర్ పీఆర్వో విజయ్ రాజీనామా!
కుంటాల సందర్శకులకు గుడ్ న్యూస్