యాదగిరిగుట్ట: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను మంగళవారం ఉదయం 8.15 నుంచి రాత్రి 8గంటలకు వరకు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 2.37 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటల వరకు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉన్నందున ఆలయ వేళల్లో మార్పులు చేశారు.
మంగళవారం వేకువజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచి, సుప్రభాతం తదితర సేవల అనంతరం 6.15 నుంచి 7.30 వరకు ఉభయ దర్శనాలు కల్పించనున్నారు. అనంతరం ద్వార బంధనం చేస్తారు. చంద్రగ్రహణం పూర్తయిన తరువాత రాత్రి 8గంటలకు ఆలయాన్ని తెరచి సంప్రోక్షణ, ప్రాయశ్చిత్త హోమం, నవకలశాభిషేకం, ఆరాధన, అర్చన, నివేదన, చాత్మర చేపట్టి, రాత్రి 10 గంటలకు శయనోత్సవం నిర్వహించి, ద్వార బంధనం చేస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీస్వామి వారికి అన్నకూటోత్సవాన్ని లాంఛనంగా నిర్వహిస్తారు.
చంద్రగ్రహణం సందర్భంగా నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, ఊరేగింపు సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే, స్వామి వారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు, వాహన పూజలు సైతం ఉండవని వెల్లడించారు. ఈ పూజలన్నీ 9వ తేదీన యథావిధిగా కొనసాగుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment