
సాక్షి, యాదగిరిగుట్ట: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ యాదాద్రి చేరుకొని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆచార్యులు ఆయనకు వేద ఆశీర్వచనం ఇచ్చారు. అంతకు ముందు యాదాద్రి చేరుకున్న సీజేఐ ఎన్‌వీ రమణకు మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, విప్ గొంగిడి సునితామహేందర్ రెడ్డి, ఆలయ ఈవో గీతారెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సీజేఐ ఎన్వీ రమణ ప్రధానాలయ పునః నిర్మాణ పనులు పరిశీలిస్తారు. అనంతరం రింగ్‌రోడ్డు మార్గంలో ఉన్న టెంపుల్ సిటీ, ప్రెసిడెన్షియల్ సూట్‌ను సందర్శిస్తారు.