
ఓ రహస్యం చెప్పిన రాజమౌళి
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయవంతమైన దర్శకుడిగా శిఖరాగ్రానికి చేరుకున్న రాజమౌళి ఎందరో యువ దర్శకులకు ఆదర్శంగా నిలిచారు. ఎందరో నటులను స్క్రీన్పై అద్భుతంగా చూపిన రాజమౌళికి నటనలోనూ ప్రతిభ ఉందా? ఆయన నటనను ఇప్పటి వరకు వెండితెరపై చూడలేదు.
చాలామందికి తెలియని విషయం ఏంటంటే రాజమౌళి దర్శకుడిగా పరిచయం కాకముందే నటుడిగా అరంగేట్రం చేశారు. చిన్నప్పుడు ఓ సినిమాలో నటించారు. కాకపోతే ఆ సినిమా విడుదల కాకపోవడంతో స్క్రీన్పై రాజమౌళిని చూడలేకపోయాం. రాజమౌళే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. 'నా చిన్నతనంలో కృష్ణుడి పాత్రలో నటించాను. దురదృష్టవశాత్తూ ఆ సినిమా పూర్తికాలేదు' అని రాజమౌళి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. కృష్ణాష్టమి సందర్భంగా రాజమౌళి ఈ రహస్యాన్ని అభిమానులతో పంచుకున్నాడు.