శ్రీకృష్ణుడి ఫ్లెక్సీ తొలగింపుపై రాస్తారోకో | protests over lord krishna flexi removing in guntur district | Sakshi
Sakshi News home page

శ్రీకృష్ణుడి ఫ్లెక్సీ తొలగింపుపై రాస్తారోకో

Published Sun, Apr 17 2016 11:46 AM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM

protests over lord krishna flexi removing in guntur district

దుగ్గిరాల: గుంటూరు జిల్లాలో శ్రీకృష్ణుడి ఫ్లెక్సీ తొలగింపుపై వివాదం చెలరేగింది. దుగ్గిరాల పట్టణంలోని శివాలయం సమీపంలో ఏర్పాటుచేసిన శ్రీకృష్ణుడి ఫ్లెక్సీని గుర్తు తెలియని దుండగులు తొలగించడంతో యాదవ కులస్తులు ఆదివారం ఆందోళనకు దిగారు.

తెనాలి-విజయవాడ మార్గంలో రాస్తారోకో చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. శ్రీకృష్ణుని ఫ్లెక్సీని తొలగించిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పాడడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులతో చర్చిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement