
శ్రీకృష్ణుడు ఈవ్‌టీజరే: ప్రశాంత్ భూషణ్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఆకతాయిలకు వ్యతిరేకంగా అమలుచేస్తున్న ‘యాంటీ రోమియో’ కార్యక్రమాన్ని విమర్శిస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ శ్రీకృష్ణునిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయనపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘రోమియో ఒక్క అమ్మాయినే ప్రేమించాడు. కానీ శ్రీకృష్ణుడు పురాణాల్లో ఈవ్‌టీజర్‌గా నిలిచిపోయాడు.
తన అనుచరులను కృష్ణ వ్యతిరేక బృందాలు అని పిలిచేందుకు యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు ధైర్యముందా?’ అని భూషణ్ ట్వీట్ చేశారు. తర్వాత.. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, హిందూ సెంటిమెంట్లను అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు.