భారత పౌరసత్వం పొందిన తర్వాత మొదటి ఓటేసిన అక్షయ్ కుమార్ | Akshay Kumar First Vote After Getting Indian Citizenship | Sakshi
Sakshi News home page

భారత పౌరసత్వం పొందిన తర్వాత మొదటి ఓటేసిన అక్షయ్ కుమార్

Published Mon, May 20 2024 10:25 AM | Last Updated on Mon, May 20 2024 10:38 AM

Akshay Kumar First Vote After Getting Indian Citizenship

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఐదో విడుత కొనసాగుతుంది. నేడు (మే 20)  ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ జరుగుతుండగా బాలీవుడ్ నటీనటులు తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు క్యూలు కట్టడం విశేషం.

తాజాగా బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ తన ఓటు హక్కును ఉపయోగించుకున్నాడు. భారత పౌరసత్వం తిరిగి పొందిన తర్వాత తొలిసారిగా తను ఓటు వేశాడు. ఈ సమయంలో  అక్షయ్ కుమార్ చాలా సంతోషంగా కనిపించాడు. సిరా వేసిన వేలిని అందరికీ చూపుతూ..  పోలింగ్ బూత్ వెలుపల మీడియాతో మాట్లాడాడు. ఆగస్టు 2023లో భారత పౌరసత్వం పొందిన తర్వాత తొలిసారిగా ఓటు వేయడం పట్ల అక్షయ్ కుమార్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'నా భారత దేశం అభివృద్ధి చెందాలని, బలంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దానిని దృష్టిలో ఉంచుకుని నేను ఓటు వేశాను. ప్రతి భారత పౌరుడు ఓటు వేయాలి. అప్పుడే ఓటింగ్ శాతం బాగుంటుందని నేను భావిస్తున్నాను. అని ఆయన అన్నారు.

కెనడా పౌరసత్వం ఎందుకు తీసుకున్నాడంటే
కెనడా పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాన్ని అక్షయ్‌ కుమార్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇలా వివరించాడు. '1990ల్లో నా సినిమాలన్నీ వరుసగా ప్లాప్‌ అయ్యాయి. అప్పుడు ఏకంగా 15 సినిమాలు పరాజయం చెందాయి. అప్పుడు నేను చాలా నిరుత్సాహపడ్డాను. దీంతో కెరియర్‌ కాస్త ఇబ్బందుల్లో పడింది. 

ఆ సమయంలో కెనడాలో ఉన్ననా  స్నేహితుడి సలహా మేరకు అక్కడికి వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకున్నా. అప్పుడే కెనడా పాస్‌పోర్ట్‌ తీసుకున్నాను. నేను ఇండియా నుంచి వెళ్లిపోదామనేకునే సమయంలో నా రెండు సినిమాలు  ఘన విజయం సాధించడంతో నాలో మళ్లీ ఆత్మవిశ్వాసం వచ్చింది. దీంతో అక్కడికి వెళ్లలేదు. ఈ క్రమంలోనే పాస్‌పోర్ట్‌ విషయం మరిచిపోయా.' అని అక్షయ్‌ చెప్పుకొచ్చాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement