అనారోగ్యంపై విష కథనాలా? | Perni Nani angry on Yellow Media | Sakshi
Sakshi News home page

అనారోగ్యంపై విష కథనాలా?

Published Wed, May 24 2023 4:54 AM | Last Updated on Wed, May 24 2023 4:54 AM

Perni Nani angry on Yellow Media - Sakshi

సాక్షి,అమరావతి: ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి విచారణపై ఎల్లో మీడియా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మండిపడ్డారు. గుండె జబ్బుతో విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో ఉన్న తల్లిని జాగ్రత్తగా చూసుకునేందుకు ఆయన వెళ్లడం పారిపోవడమా? అని నిలదీశారు. పదేపదే అసత్యాలు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

అవినాష్‌ అరెస్టుకు రాష్ట్ర పోలీసులు సహకరించడం లేదని,  కేంద్ర బలగాలను తరలిస్తున్నారని, హెలికాప్టర్లు కూడా రప్పిస్తున్నారంటూ పిచ్చి ప్రచారాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు రాష్ట్రంలోకి సీబీఐని అడుగు పెట్టనివ్వబోనని చంద్రబాబు జీవో తీసుకొస్తే వంత పాడిన ఎల్లో మీడియా ఇప్పుడు అవినాష్‌ను సీబీఐ అరెస్టు చేసి అర్జంటుగా విచారించాలంటూ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పేర్ని నాని మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

జీవో 176లో ఏముందంటే..
చంద్రబాబు అధికారంలో ఉండగా రాధాకృష్ణ, రామోజీ సలహా మేరకు ప్రధాని మోదీతో గొడవ పెట్టుకున్నారు. దీంతో తమ పాపాలన్నీ వెలికి తీసి పాత కేసులను తిరగ తోడతారన్న భయంతో రాష్ట్రంలో సీబీఐని నిషేధిస్తూ 2018 నవంబరు 8న ఏకంగా జీవో 176 జారీ చేశారు.

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రాష్ట్రంలో కూడా పని చేయవచ్చంటూ అంతకు ముందు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తూ చంద్రబాబు ఆ జీవో ఇచ్చారు. రాష్ట్రంలో ఏ కేసునూ సీబీఐ దర్యాప్తు చేయకూడదని, ఏ కేసులోనూ ఎవరినీ విచారించవద్దని, అదుపులోకి తీసుకోవద్దని, అరెస్టు చేయకూడదంటూ ఆ జీవోలో పేర్కొన్నారు. దీనికి ఎల్లో మీడియా ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది?

బాబు బతుకంతా స్టేలే కదా?
చంద్రబాబుపై నమోదైన కేసుల్లో ఒక్కదానిపై అయినా విచారణ జరిగిందా? ప్రతి కేసులోనూ ఆయన స్టే లేదా బెయిల్‌ పొందుతూ రాజకీయాలు చేస్తున్నారు కదా? గతి తప్పిన ఎల్లో మీడియా సీఎం జగన్‌పై విషం చిమ్ముతూ తమకు అనుకూలమైన వారితో చర్చలు పెట్టడం నిత్యకృత్యంగా మారింది.

టీడీపీ, ఎల్లో మీడియా వికృత విన్యాసాలను ప్రజలంతా గమనిసూ్తనే ఉన్నారు. నిజంగా ఏ తప్పూ చేయకుంటే చంద్రబాబు, రామోజీరావు కోర్టులకు వెళ్లి స్టేలు, బెయిళ్లు ఎందుకు తెచ్చుకున్నారు? అభియోగాలు నమోదైన ప్రతిసారీ వారు కోర్టులను ఆశ్రయించడం, స్టే లేదా బెయిల్‌ బెయిల్‌ తెచ్చుకోవడం అందరికీ తెలిసిన విషయమే కదా? వారికే ఆ హక్కులుంటాయా? ఏనాడైనా నిజాల్ని నిరూపించుకునేందుకు సిద్ధం, విచారణకు వస్తానని చంద్రబాబు చెప్పారా? 

రామోజీ డ్రామాలు
సీఐడీ విచారణ కోసం వెళ్తే నడుముకు బెల్టుతో, పక్కన వెంటిలేటర్‌ పెట్టుకుని బెడ్‌పై పడుకున్న రామోజీరావు ఎంత డ్రామా చేశారో అందరూ చూశారు. కోర్టులకు వెళ్లడం, స్టేలు, బెయిళ్లు తెచ్చుకునే హక్కులు చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణకు మాత్రమే ఉంటాయా? ఎల్లో మీడియాకి కనీసం మానవత్వం అనేది ఉందా? 

నిధులు తెచ్చినా ఏడుపేనా?
రాష్ట్ర విభజన సమయంలో 2014 –15 రెవెన్యూ లోటు గ్రాంటు కింద చంద్రబాబు తేవాల్సిన డబ్బు­ను తీసుకురాలేక విఫలమైతే ఇప్పడు సీఎం జగన్‌ కేంద్రంతో మాట్లాడి రూ.10,461 కోట్లు సాధించారు. దాన్ని జీర్ణించుకోలేక నిధుల వరద అంటూ క­థ­­నా­లు ప్రచురించారు. సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లిన ప్ర­తీ­సారి ఎల్లో మీడియా, చంద్రబాబు అభాండాలు వే­శారు. ఇప్పుడు నిధులు సాధించినా ఏడుపేనా? పా­జిటివ్‌గా ఎందుకు రాయడం లేదు?  మ­చిలీపట్నంలో సీఎం జగన్‌ సభ  బ్రహ్మాండంగా జరిగితే దానిపైనా తప్పుడు రాతలు రాశారు.  

నాడు వ్యతిరేకించి నేడు స్వాగతం 
చంద్రబాబు ఆస్థాన సలహాదారులైన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, రాజకీయ ఆక్టోపస్‌ రామోజీరావు అంతా కలిసి గూడుపుఠాణి చేసి నాడు సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా చేశారు. సీబీఐకి ఎర్రజెండా అంటూ ఈనాడులో వార్తలు ప్రచురించగా, రాష్ట్రంలో సీబీఐకి ప్రవేశం లేదంటూ రాధాకృష్ణ రాసుకొచ్చారు.

సీబీఐకి అవకాశం కల్పిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కూడా ఏసీబీతో సోదాలు చేసే అవకాశం ఉందని, అందుకే చంద్రబాబు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుందంటూ సమర్థించారు. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వివేకా హత్యకు సంబంధించి ఎంపీ అవినాష్‌పై విషపురాతలు రాస్తూ, అసత్యాలు ప్రచారం చేస్తూ సీబీఐని స్వాగతిస్తూ బ్రహ్మరథం పడుతూ అత్యవసరంగా విచారించాలంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement