
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ అవినాష్‌రెడ్డి కలిశారు. ముద్దనూరు నుంచి బి.కొత్తపల్లి జాతీయ రహదారి పనులకు టెండర్ పిలిచి ఆరు నెలలు అయ్యిందని, వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరారు.
బాకరపేట నుంచి బెస్తవారిపేట వయా బద్వేల్, పోరుమామిళ్ల రహదారిని జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.