సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి కాల్ రికార్డులో సంచలనం ఏమీ లేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహా రాలు) సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ విష యంపై నాలుగు రోజుల నుంచి పచ్చ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, ఏదో జరిగిపోయిందంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు.
శుక్రవారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మరణించిన అంశాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలియజేసేందుకు, ఆయన ఇంట్లో పనిచేసే (అటెండర్) నవీన్‌కు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫోన్ చేశారని తెలిపారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్య కేసులో నవీన్, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డిలను సీబీఐ విచారించడంపై పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తుండటం దారుణం అని ధ్వజమెత్తారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే..
ఇందులో కొత్త కోణం ఏముంది?
∙వైఎస్ జగన్‌కు సమాచారమిచ్చేందుకు ఫోన్ చేయడం తప్పా? వైఎస్ అవినాష్‌రెడ్డి ఫోన్‌ను ఆ రోజే పోలీసులు చెక్ చేశారు. వైఎస్ జగన్‌తో మాట్లాడేందుకే అవినాష్‌రెడ్డి నవీన్‌కు ఫోన్ చేశారు. ఈ విషయంపై ఎల్లోమీడియా రాద్ధాంతం చేయడం ఎంత వరకు సబబు? ఇందులో సంచలనం ఏముంది? విచారణకు పిలిస్తే నవీన్, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిలు హాజరయ్యారు. దీంట్లో కొత్త కోణం ఏముంది?
- వైఎస్ అవినాష్‌రెడ్డి జమ్మలమడుగుకు వెళ్తుండగా వివేకానందరెడ్డి బావమరిది శివప్రసాద్‌రెడ్డి ఫోన్ చేస్తే ఆయన వెనుతిరిగివచ్చాడు. ఒకవేళ ఈయన ఫోన్ చేయకపోతే అవినాష్‌రెడ్డి వెనక్కి వచ్చేవారు కాదేమో? ఇందులో ఆయన హస్తం ఉందని ఒక కేస్ బిల్డ్ చేసి, దాన్ని బేస్ చేసుకొని ఇన్నేళ్ల తర్వాత విచారణకు పిలిచినప్పుడు దానికి ముందు, వెనుక కొత్త కోణం ఉందంటూ ప్రచారం చేస్తున్నారు.
- ఇందులో ఫ్యామిలీతో సహా అందరూ ఉన్నట్లు ప్రచారం చేయడం రాజకీయం కాక మరేమవుతుంది? టీడీపీ, చంద్రబాబు చేసే నీచ రాజకీయంలో ఇదొక పార్ట్. రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని డ్రామాలు చేస్తారో చూడాలి.
లెటర్ విషయం ఎందుకు దాచిపెట్టారు?
వివేకానందరెడ్డి మరణించిన వార్త తొలుత వెళ్లింది ఆయన అల్లుడు, ఇంకో బావమరిదికే. అక్కడ ఓ లెటర్ ఉందని, ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని ఎందుకు దాచిపెట్టారు? అప్పుడే వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డి పోలీసులకు ఫోన్ చేసి ఉండవచ్చు కదా? లెటర్ దొరికిందట.. జాగ్రత్తగా ఉండమని శివప్రసాద్‌రెడ్డి చెప్పాలి కదా? ఎందుకు చెప్పలేదు? అసలు ప్రశ్న అక్కడ వేయాలి. ఆయన ఫోన్ చేస్తే అవినాష్‌రెడ్డి వెళ్లారు. దానిపై కథలు కథలు అల్లుతున్నారు.
మొత్తంగా వైఎస్ జగన్ వద్దకు తీసుకువచ్చేందుకు నవీన్‌కు ఫోన్ చేశారని, కృష్ణమోహన్‌రెడ్డికి ఫోన్ చేశారని లింకులు కలిపే దుర్బుద్ధితో రాజకీయాలు చేస్తున్నారు. ఇందులో ఎవరెవరు సూత్రధారులు ఉన్నారో ప్రజలకు తెలుసు. ఈ కేసు నిలబడదు. ఈ అంశంపై మేం ప్రతిసారి వివరణ ఇవ్వాల్సి వస్తోంది. వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు పెట్టినప్పుడు ఆ రోజు సీబీఐ ధోరణి ఎలా ఉందో చూశాం. విచారణకు ఎవరిని పిలవాలో కూడా ఎల్లో మీడియాలో ముందే వచ్చేది. విచారణ చేసే సమయంలో ఏం జరుగుతుందో కూడా కథలు, కథలుగా వచ్చేవి.
కుట్ర పూరితంగా సీఎంపై బురద
ఇప్పుడు కూడా సీబీఐకి, ఎల్లో మీడియాకు, చంద్రబాబుకు అవే లింకులు ఉన్నాయి. అందుకే దుష్ప్రచారం చేస్తున్నారు. లేనిదాన్నిలాగి కుట్రపూరితంగా బురద చల్లుతున్నారు. ఈ కేసును అడ్డుపెట్టుకుని 2024 ఎన్నికల్లో జగన్ క్యారెక్టర్‌పై బురద చల్లడానికి కుదురుతుందేమో.. ప్రజల్లో అనుమానాలు తీసుకురావడానికి కుదురుతుందేమో అనే దుర్బుద్ధితో కుట్రలు చేస్తున్నారు.
- ఆకాశంపై ఉమ్మితే వారి ముఖాలపైనే పడుతుంది. గతంలో ఇంతకంటే పెద్దవే చెప్పారు. వాళ్ల ధోరణి, కుట్ర బుద్ధి తెలుసు కాబట్టి ప్రజలు విశ్వసించలేదు. చంద్రబాబు, బీజేపీలోని స్లిపర్ సెల్స్‌పైనే అనుమానాలు ఉన్నాయి.
- ఎల్లో మీడియానే చంద్రబాబుకు అజెండా ఫిక్స్ చేస్తుంటే ఆయన నటిస్తున్నారు. వ్యవస్థను ప్రభావితం చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఏవైనా చేయగలరు. అందుకే ఇవాళ్టికీ ఆయనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు.
చదవండి: ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం సన్నాహకాలపై సీఎం జగన్ సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment