
సాక్షి, అమరావతి: మూడేళ్లుగా సంక్షేమ పాలన అందిస్తున్నామని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అవినీతి లేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నామన్నారు. టీడీపీ, ఎల్లోమీడియా ఏదో విధంగా ప్రభుత్వంపై బురద జల్లుతుందని, అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.
చదవండి: సెట్టింగ్ ‘బంగార్రాజు’.. ఇదేందయ్యా ఇది..
‘‘గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. మేనిఫెస్టోలో 90 శాతంపైగా హామీలను సీఎం జగన్ నెరవేర్చారు. సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదు. రోజూ ఏదో ఒక అబద్ధంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఆర్‌డీఏ భూముల విక్రయంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మా ప్రభుత్వంలో డిస్టలరీకి అనుమతి ఇవ్వలేదు. అధికారంలోకి రావడానికి బరి తెగించి ప్రవర్తిస్తున్నారు.
మద్యంలో విషం కలుపుతున్నారనే ఆరోపణలు దారుణం. టీడీపీ ఎజెండాను ఎల్లో మీడియా సిద్ధం చేస్తోంది. ల్యాప్‌ట్యాప్‌లపై ఇష్టానుసారం కథనాలు ప్రచురించారు. విద్యార్థుల భవిష్యత్తుపై చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా?. అమరావతి నుంచే సంపద సృష్టిస్తామన్నారు.. ఇప్పుడు ఏదో జరిగిపోతోందని గగ్గోలు పెడుతున్నారు. జీపీఎఫ్ అంశం కేవలం సాంకేతిక సమస్య. ఏ ప్రభుత్వమైనా రూ.800 కోట్లు లెక్కల్లేకుండా తీసుకోగలదా?. ఇదేమన్నా రామోజీరావు చిట్‌ఫండ్ కంపెనీనా?’’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment