
సాక్షి, హైదరాబాద్: ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. కాగా, తల్లి అనారోగ్యం కారణంగా అవినాష్‌రెడ్డి.. ఆసుపత్రిలోనే ఉన్న సంగతి తెలిసిందే.
అవినాశ్‌రెడ్డి మాతృమూర్తి తీవ్ర అనారోగ్యంతో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ ఎంజైమ్స్ సాధారణం కంటే ఎక్కువ ఉండటంతో ఆమె ఆరోగ్యం విషమించింది. వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అవినాశ్ దగ్గరుండి తల్లి బాగోగులు చూసుకుంటున్నారు. మరో వైపు ఈ వ్యవహారంపై ఎల్లో మీడియా శుక్రవారం మధ్యాహ్నం నుంచి తప్పుడు కథనాలను ప్రసారం చేసింది.
చదవండి: అవినాశ్ తల్లికి తీవ్ర అస్వస్థత.. మానవత్వం లేకుండా ఎల్లో మీడియా దుష్ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment