
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో అవినాష్‌రెడ్డికి ఊరట లభించింది. వివేకా కుమార్తె సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ నెల 24 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 24న ఉదయం 9.30కి కేసు వివరాలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇస్తే సీబీఐ అరెస్ట్ చేస్తుందని అవినాష్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.
చదవండి: ఏది నిజం?: వివేకా హంతకుల్ని నడిపిస్తున్నదెవరు?
Comments
Please login to add a commentAdd a comment