సాక్షి, న్యూఢిల్లీ: ముందస్తు బెయిలు కోరుతూ ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. అవినాష్‌కు ముందస్తు బెయిలు ఇవ్వొద్దంటూ మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి ఈ పిటిషన్‌ను జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహాలుతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించనుంది.
ఇదిలా ఉంటే, తమ పిటిషన్ విచారించాలంటూ అవినాష్ తరఫు న్యాయవాది సోమవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. మరో వెకేషన్ బెంచ్‌కు వెళ్లాలని ధర్మాసనం సూచించడంతో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్‌కరోల్‌లతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. తాను సభ్యుడిగా లేని ధర్మాసనం జాబితాలో చేర్చాలని జస్టిస్ సంజయ్ కరోల్ రిజిస్ట్రీకి సూచించారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది.
సంఖ్య |
విషయం | సంబంధిత సమాచారం |
1 |
డైరీ నెంబర్ |
20416/2023 |
2 |
కేసు నెంబర్ |
MA 00 1285 |
3 | విచారణ తేదీ | 23 మే 2023 |
4 | CL నెంబర్ | 36 |
5 | కేటగిరీ | క్రిమినల్ మ్యాటర్స్ |
6 | సబ్జెక్ట్ | బెయిల్ |
7 | బెంచ్ | 1. జస్టిస్ J.K.మహేశ్వరీ |
8 | 2. జస్టిస్ పమిడిగంఠం శ్రీ నరసింహా | |
పిటిషనర్ | సునీత నర్రెడ్డి | |
09 | రెస్పాండెంట్స్ | 1. Y.S.అవినాష్ రెడ్డి |
2. డైరెక్టర్, CBI | ||
10 | సునీత తరపు న్యాయవాది | జెసల్ వాహి |
11 | అవినాష్ తరపు న్యాయవాది | ముకుంద్ P.ఉన్నీ |
Comments
Please login to add a commentAdd a comment