సి.బెళగల్(కర్నూల్ జిల్లా): కోడుమూరు, కృష్ణగిరి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు 70 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు దారి చూపిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ అన్నారు. మంగళవారం కోడుమూరు మండలం గోరంట్ల గ్రామం వద్ద హంద్రీ నదిపై వంతెన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, పాణ్యం, పత్తికొండ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కంగాటి శ్రీదేవి, కుడా చైర్మన్, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
హంద్రీ ఒడ్డున భూమిపూజ చేసి శిలా ఫలకాన్ని వీరు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ మాట్లాడుతూ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 24 కోట్లు మంజూరు చేయడంతో పలు గ్రామాల ప్రజల కష్టా లు తొలగిపోతున్నాయన్నారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి గెలిపించుకుందామన్నా రు.
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడు తూ ప్రజా సంకల్ప యాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాంత ప్రజల కష్టాలు చూసి చలించి, అధికారంలోకి వస్తే వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చారన్నారు. కృష్ణగిరి, కోడుమూరు ప్రజలు ఎప్పటికీ జగనన్న మేలు మరువరన్నారు. కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజాప్రతినిధులు, అధికారులను ప్రజల వద్దకు పంపుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికే ఆదర్శమన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment