Handri river
-
దశాబ్దాల సమస్యకు దారి చూపిన జగన్
సి.బెళగల్(కర్నూల్ జిల్లా): కోడుమూరు, కృష్ణగిరి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు 70 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు దారి చూపిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ అన్నారు. మంగళవారం కోడుమూరు మండలం గోరంట్ల గ్రామం వద్ద హంద్రీ నదిపై వంతెన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, పాణ్యం, పత్తికొండ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కంగాటి శ్రీదేవి, కుడా చైర్మన్, నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి తదితరులు హాజరయ్యారు. హంద్రీ ఒడ్డున భూమిపూజ చేసి శిలా ఫలకాన్ని వీరు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ మాట్లాడుతూ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 24 కోట్లు మంజూరు చేయడంతో పలు గ్రామాల ప్రజల కష్టా లు తొలగిపోతున్నాయన్నారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి గెలిపించుకుందామన్నా రు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడు తూ ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంత ప్రజల కష్టాలు చూసి చలించి, అధికారంలోకి వస్తే వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చారన్నారు. కృష్ణగిరి, కోడుమూరు ప్రజలు ఎప్పటికీ జగనన్న మేలు మరువరన్నారు. కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజాప్రతినిధులు, అధికారులను ప్రజల వద్దకు పంపుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శమన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. -
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్.. 12 గ్రామాలకు తీరనున్న కష్టాలు
సాక్షి, కర్నూలు: దశాబ్దాల కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. కోడుమూరు మండలం గోరంట్ల గ్రామం దగ్గర హంద్రీ నదిపై కాజ్వే నిర్మాణానికి రూ.24 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ పనులను ఓఎంఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. ఏడాదిలోపు పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. నిర్మాణ పనులను ఈనెల 24న ప్రారంభించనున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో భాగంగా కృష్ణగిరి మండలంలోని ఎస్‌హెచ్ ఎర్రగుడి నుంచి హంద్రీనది మీదుగా కోడుమూరు మండలంలోని గోరంట్ల గ్రామానికి 2017 నవంబర్ 27వ తేదీన నడుచుకుంటూ వచ్చారు. ఆ సమయంలో ఆ ప్రాంత ప్రజలు హంద్రీనదిపై కాజ్వే నిర్మించాలని కోరారు. మన ప్రభుత్వం వస్తే కాజ్వే నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని అప్పట్లో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు నిధులను మంజూరు చేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది. ప్రయాణం సులువు గోరంట్ల నుంచి కొత్తపల్లె, ఎస్‌హెచ్‌ఎర్రగుడి గ్రామాలకు రెండు కిలోమీటర్లు దూరం ఉంది. హంద్రీ నదికి వరద వస్తే 15 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆయా గ్రామాలకు చేరుకోవలసిన దుస్థితి ఉండేది. హంద్రీకి వరద వచ్చే సమయాల్లో విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళలేని పరిస్థితి. కాజ్వే నిర్మాణం చేపడితే కష్టాలు తొలగనున్నాయి. అలాగే కృష్ణగిరి, కోడుమూరు మండలంలోని కొత్తపల్లె, రామకృష్ణాపురం, ఎస్‌హెచ్ ఎర్రగుడి, ఎర్రబాడు, చుంచు ఎర్రగుడి, మన్నేగుంట, కృష్ణగిరి, బాపనదొడ్డి, కంబాలపాడు, జి.మల్లాపురం, ఆగవెలి, పి.కోటకొండ గ్రామాల ప్రజలకు ప్రయాణం సులువు కానుంది. ఇవీ కష్టాలు.. ►గోరంట్ల గ్రామం దగ్గర ఉన్న హంద్రీనది ప్రతి ఏటా వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. ► ఈ నది దాటి వెళ్లేందుకు కృష్ణగిరి, కోడుమూరు మండలంలోని 12 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ►కొన్ని సందర్భాల్లో రోజులు తరబడి రాకపోకలు నిలిచిపోయేవి. ► అత్యవసర సమయాల్లో కర్నూలు నగరానికి, కోడుమూరు పట్టణానికి చేరుకోవాలంటే కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది. ► పాఠశాలలకు వెళ్లే ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రతిరోజూ హంద్రీ నది పరీక్ష పెట్టేది. ►కాన్పుల కోసం గర్భిణులను అసుపత్రికి తీసుకెళ్లాలంటే తలప్రాణం తోకకు వచ్చేది. దశాబ్దాల సమస్యకు పరిష్కారం హంద్రీ నదిపై కాజ్వే లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. బాల్యంలో మా ఊరు ఎన్హెచ్ఎర్రగుడి నుంచి నేను లద్దగిరికి చదువుకోవడానికి వెళ్లేవాడిని. హంద్రీపై కాజ్వే లేక చాలా ఆవస్థపడ్డా. హంద్రీ నదికి వరద వచ్చిన రోజుల్లో స్కూల్‌కు వెళ్లలేని పరిస్థితి. దశబ్దాల కాలంగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు కాజ్వే నిర్మాణంతో పరిష్కారం దొరికింది. చాలా ఆనందంగా ఉంది. – సుధాకర్, కోడుమూరు ఎమ్మెల్యే చాలా సంతోషం ఈ కష్టం ఇప్పటిది కాదు. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. భారీ వర్షం వస్తే హంద్రీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడతాయి. పంటలు అమ్ముకోవాలంటే మేం నది దాటి వెళ్లాలి. కాజ్వే లేకపోవడంతో చాలా అవస్థలు పడుతున్నాం. మా ఊరి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోడుమూరుకు వెళ్లి అక్కడి నుంచి కర్నూలు మార్కెట్‌కు పంట ఉత్పత్తులు తీసుకెళ్తున్నాం. లేదంటే కృష్ణగిరికి వెళ్లి వెల్దుర్తి నుంచి కర్నూలుకు వెళ్లాల్సి వస్తోంది. గోరంట్ల వద్ద హంద్రీ నదిపై బ్రిడ్జి నిర్మిస్తే కేవలం 25 కిలోమీటర్ల ప్రయాణంతో కర్నూలుకు చేరుకుంటాం. బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాణం పూర్తయితే రైతుల ఇబ్బందులు తొలగిపోతాయి. మా ఊరితోపాటు చాలా గ్రామాలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగు పడతాయి. – సుంకన్న, ఎస్‌హెచ్ ఎర్రగుడి 24న నిర్మాణ పనులకు శంకుస్థాపన గోరంట్ల సమీపంలోని హంద్రీ నదిపై కాజ్వే నిర్మాణానికి ఈ నెల 24వ తేదీన శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూర్ జయరాం, ఎమ్మెల్యేలు కంగాటి శ్రీదేవి, సుధాకర్, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, హాజరుకానున్నారు. – చౌడేశ్వరరావు, డీఈఈ, పీయూఐ -
కనిపిస్తే అరెస్ట్.. వెతికితే ఒట్టు!
- ఇసుక మాఫియాకు పోలీస్ రక్షణ - 34 మందిపై కేసు నమోదు - ఇప్పటి వరకు ఐదుగురు మాత్రమే అరెస్ట్ - మిగతా నేరస్తులంతా బెయిల్ కోసం ప్రయత్నాలు - నిందితులు అజ్ఞాతంలో ఉన్నారని పోలీసుల నివేదిక కోడుమూరు : హంద్రీనదిలో లక్షలాది క్యూబిక్‌మీటర్ల ఇసుకను అక్రమంగా తరలించుకుపోయి కోట్లాది రూపాయలు మూటగట్టుకున్న ఇసుక మాఫీయాకు పోలీసులు రక్షణ కవచంగా నిలుస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా కారణంగా తమ పొలాలు ఎండిపోతున్నాయంటూ ఎర్రగుడి, మన్నెగుంట, గోరంట్ల రైతులు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అక్రమ ఇసుకను దోచుకున్న వాళ్లందరిపై కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు హడావుడిగా విచారణ చేసి కృష్ణగిరి మండలంలోని ఎర్రగుడి, రామకృష్ణాపురం, కృష్ణగిరి, మన్నెగుంట, కోడుమూరు మండలంలోని గోరంట్ల గ్రామానికి చెందిన 34 మంది ఇసుక వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. వీరంతా ఆయా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రధానంగా చలామణి అవుతున్న నేతలు. జిల్లాలోని ముఖ్య నేతల ఆశీస్సులు వీరికి ఉన్నాయి. దీంతో పోలీసులు తూతూమంత్రంగా వారిపై కేసులు నమోదు చేశారు గాని వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న వారిపై కేసులు నమోదైన రాజకీయ నాయకుల అండదండలతో బహిరంగంగానే తిరుగుతున్నారు. అయితే వారంతా తప్పించుకొని తిరుగుతూ అజ్ఞాతంలో ఉన్నారని పోలీసులు కోర్టుకు నివేదికలు అందజేస్తున్నారు. చిన్నా చితక నేతలు ఐదుగురిని ఈ కేసులో మొదటగా అరెస్ట్ చేశారు. వారికి బెయిల్ వచ్చిన వెంటనే ఆ బెయిల్ ఆధారంగా మిగతా వాళ్లు కూడా బెయిల్ తెచ్చుకునే వెసులుబాటును ఆసరాగా చేసుకొని మిగతా అక్రమార్కులను పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేశారు. రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా వారందరూ యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపణలున్నాయి. ఇసుక అక్రమ రవాణా నేరంలో ఇద్దరు ముఖ్య నేతలు యాంటిస్ఫెటరీ బెయిల్ తెచ్చుకున్నారు. 14మందిని అరెస్ట్ చేశాం : సోమ్లనాయక్, ఎస్ఐ, కృష్ణగిరి గోరంట్ల, ఎర్రగుడి సరిహద్దులో గాజులదిన్నె హంద్రీనదిలో ఇసుకను అక్రమంగా తరలించినందుకు 34 మందిపై కేసులు నమోదు చేశాము. ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేశాం. ఇద్దరు యాంటిస్ఫెటరీ బెయిల్ తెచ్చుకున్నారు. మిగతా నేరస్తులు అజ్ఞాతంలో ఉంటూ తప్పించుకు తిరుగుతున్నారు. త్వరలో వారందరిని అరెస్ట్ చేస్తాం. -
మీరు చర్యలు తీసుకున్నారా? ఇదో జోక్
హంద్రీ నదిలో ఇసుక తవ్వకాలపై హైకోర్టు సీరియస్ సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమార్కు లపై చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడాన్ని హైకోర్టు ఓ జోక్‌గా అభివర్ణించింది. చర్యలు తీసు కున్నామంటే నమ్మమంటారా? అంటూ ప్రశ్నించింది. కర్నూలు జిల్లా, హంద్రీ నదిలో సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకా లపై దాఖలైన వ్యాజ్యం విచారణలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తవ్వకా లను అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకు న్నారు, ఏం చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని హైకోర్టు మంగళవారం ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. వివరాలతో నివే దికను వచ్చే మంగళవారానికల్లా తమ ముందుంచాలని జిల్లా ఎస్పీకి స్పష్టం చేసింది. లేకుంటే కోర్టు ముందు హాజరు కావాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గోరంట్ల గ్రామస్తులు
కోడుమూరు రూరల్ : మండలంలోని గోరంట్ల హంద్రీనది నుంచి ఇసుక తరలించుకుపోతున్న ట్రాక్టర్లను బుధవారం గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. సుమారు మూడు గంటల పాటు ట్రాక్టర్లను హంద్రీనదిలో నుంచి వెళ్లనీయకుండా అక్కడే నిలిపేశారు. చివరకు ఇసుక తరలిస్తున్న 5ట్రాక్టర్లను కోడుమూరు పోలీస్‌స్టేషన్‌లో గ్రామస్తులు అప్పజెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పరశురాముడు, తెల్లన్న, ఈశ్వర్‌రెడ్డి, రాముడు, మాదన్న, భాస్కర్, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిత్యం గోరంట్ల హంద్రీనది నుంచి వందలాది ట్రాక్టర్ల ఇసుకను తరలించుకుపోతున్నా అడిగే నాథుడే లేడన్నారు. ఇసుక తరలింపుతో హంద్రీనదిలో నీటి ఊటలు తగ్గిపోవడంతో పాటు, గ్రామానికి తాగునీటిని సరఫరా చేసే పైపులైన్లు, పొలాలకు హంద్రీ నుంచి వేసుకున్న పైపులైన్లు ధ్వంసమైపోతున్నాయని వాపోయారు. అనంతరం కోడుమూరు పోలీస్‌స్టేషన్‌లో ఇసుక తరలిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఐ మహేష్‌కుమార్‌కు గ్రామస్తులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే రెవెన్యూ అధికారులకు ఇసుక రవాణాను అరికట్టాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.