మీరు చర్యలు తీసుకున్నారా? ఇదో జోక్‌ | High Court Serious | Sakshi
Sakshi News home page

మీరు చర్యలు తీసుకున్నారా? ఇదో జోక్‌

Published Wed, Feb 1 2017 2:22 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

High Court Serious

హంద్రీ నదిలో ఇసుక తవ్వకాలపై హైకోర్టు సీరియస్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇసుక అక్రమార్కు లపై చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడాన్ని హైకోర్టు ఓ జోక్‌గా అభివర్ణించింది. చర్యలు తీసు కున్నామంటే నమ్మమంటారా? అంటూ ప్రశ్నించింది. కర్నూలు జిల్లా, హంద్రీ నదిలో సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకా లపై దాఖలైన వ్యాజ్యం విచారణలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తవ్వకా లను అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకు న్నారు, ఏం చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని హైకోర్టు మంగళవారం ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

వివరాలతో నివే దికను వచ్చే మంగళవారానికల్లా తమ ముందుంచాలని జిల్లా ఎస్పీకి స్పష్టం చేసింది.  లేకుంటే కోర్టు ముందు హాజరు కావాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఏసీజే జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement