
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఇసుక తవ్వకాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం, ములకల లంక పరిధిలో గోదా వరి ఒడ్డున పట్టా భూముల్లో కృష్ణారావు అనే వ్యక్తి జరుపుతున్న ఇసుక తవ్వకాలపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. 2 వారాలు ఇక్కడ ఇసుక తవ్వకాలు జరపవద్దని ఆదేశించింది. తవ్వకాల ప్రాంతం నది పరిధిలోకి వస్తుందా? రాదా? స్పష్టతనిస్తూ కౌంటర్ దాఖలు చే యాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఇదే మండలం, వంగలపూడి పరిధిలో ఎస్.దుర్గమ్మ, డి.వెంకటేశ్వరరావు తదితరులు చేస్తున్న ఇసుక తవ్వకాలపై న్యాయాధికారితో విచారణ జరిపి నివేదిక ఇవ్వా లని ఆ జిల్లా జడ్జిని హైకోర్టు ఆదేశించింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment