సాక్షి, కర్నూలు: టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర కర్నూలుకు చేరుకుంది. ఈ క్రమంలో లోకేష్‌కు టీడీపీ స్థానిక నేతలు ట్విస్ట్ ఇచ్చారు. పాదయాత్ర సందర్బంగా టీడీపీలో వర్గపోరు మరింత ముదిరింది. స్థానిక నేతల మధ్య ఉన్న విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. ఆలూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రకు వర్గ విభేదాలతో టీడీపీ నాయకులు స్వాగతం పలికారు.
కాగా, లోకేష్ పాదయాత్ర సందర్బంగా ఫ్లెక్సీల గొడవ షురూ అయ్యింది. ఆలూరులో ఫ్లెక్సీల రగడ చోటుచేసుకుంది. అక్కడ టీడీపీ ఇన్‌ఛార్జ్ కోట్ల సుజాతమ్మ ఫొటో ఫ్లెక్సీలు కట్టాలని లోకేష్.. టీడీపీ కార్యకర్తలకు సూచించారు. అయితే, సుజాతమ్మ ఫొటోతో ఉన్న ఫ్లెక్సీలను కట్టే ప్రస్తకేలేదని అసమ్మతి నేతలు తేల్చి చెప్పారు. దీంతో, వారి సమాధానం విని లోకేష్ బాబు ఖంగుతిన్నట్టు సమాచారం. ఈ క్రమంలో అసమ్మతి నేతలు కట్టిన ఫ్లెక్సీల్లో సుజాతమ్మ.. తన ఫొటోను అతికించుకున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీల విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment