kotla sujathamma
-
ఒక్కటే సీటని.. బలమే లేదని!
చంద్రబాబును నమ్ముకుంటే ఇంతే.. నెల్లూరు జిల్లాలో ఇటీవల టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి, ఆయన భార్య ప్రశాంతికి టిక్కెట్లు ఇచ్చారు. ► తాడిపత్రి అసెంబ్లీ టిక్కెట్ దక్కించుకున్న జేసీ కుటుంబానికి, అనంతపురం పార్లమెంట్ టిక్కెట్ కూడా ఖాయమైనట్లు తెలుస్తోంది. ► అలాగే కడప ఎమ్మెల్యే అభ్యరి్థగా రెడ్డప్పరెడ్డి గారి మాధవికి ఇచ్చారు. కడప పార్లమెంట్ కూడా మాధవి భర్త శ్రీనివాసరెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. ► ఇలా చాలా చోట్ల రెండు సీట్లు ఇచ్చినప్పుడు తమకు ఇవ్వకపోవడం చూస్తే కోట్ల కుటుంబం రాజకీయంగా అత్యంత బలహీనపడిందనే భావనలో చంద్రబాబు ఉన్నట్లు స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. వైఎస్ జగన్‌తోనే న్యాయం ►రాజకీయ ప్రాధాన్యత ఉన్న కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి తగిన గౌరవం ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ► చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి చంద్రగిరి,ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డికి ఒంగోలు పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చారు. ► అలాగే మేకపాటి కుటుంబానికి రెండు సీట్లు ఇచ్చారు. ► పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారు. ► ఇలా ప్రాధాన్యత ఉన్న కుటుంబాలకు జగన్మోహన్రెడ్డి తగిన గౌరవం ఇస్తుంటే, టీడీపీలో మాత్రం ఈ పరిస్థితి లేదనే చర్చ నడుస్తోంది. సాక్షి ప్రతినిధి కర్నూలు: తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల లొల్లి కొనసాగుతోంది. నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆలూరు అసెంబ్లీ టిక్కెట్ కోట్ల సుజాతమ్మకు ఇవ్వాలని ఆమె అనుచరులు హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. చంద్రబాబు నివాసం, ఎనీ్టఆర్ ట్రస్ట్భవన్ వద్ద బైఠాయించి కోట్ల సుజాతమ్మకు టిక్కెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. అయితే చంద్రబాబు మాత్రం కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ పాలసీగా తీసుకుందని, దీన్ని అంతా అర్థం చేసుకుని పార్టీ కోసం పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు మాటలకు, చేతలకు ఏ మాత్రం పొంతన లేదనే విషయం కోట్ల కుటుంబంతో పాటు అనచరులకు కూడా స్పష్టమైంది. జిల్లాలో అత్యంత రాజకీయ ప్రాధాన్యత ఉన్న కుటుంబాల్లో కోట్ల కుటుంబం ఒకటి. విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, ప్రకాశ్‌రెడ్డి కేంద్రమంత్రిగా పని చేశారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నంత వరకూ కర్నూలు జిల్లాను కోట్ల కుటుంబం శాసించింది. కాంగ్రెస్‌పార్టీలో వారు చెప్పిన వారికి సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఈ కుటుంబం కాంగ్రెస్ పార్టీని వీడి 2019లో టీడీపీ తీర్థం పుచ్చుకుంది. ఆ ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యేగా సుజాతమ్మ ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్‌పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా సూర్యప్రకాశ్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. ఈ ఓటముల నేపథ్యంలో పార్టీ బలం మినహా కోట్ల కుటుంబానికి వ్యక్తిగతంగా పెద్ద బలం లేదనే భావనకు చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతోనే పార్లమెంట్ స్థానాన్ని తప్పించి డోన్ అసెంబ్లీకి పరిమితం చేశారు. కుటుంబానికి ఒకే టిక్కెట్ అంటూ సుజాతమ్మను తప్పించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా సుజాతమ్మ టీడీపీ ప్రకటించిన రెండు జాబితాల్లో కూడా సుజాతమ్మ పేరు లేదు. ఉమ్మడి జిల్లాలో ఆదోని, ఆలూరు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. దీంతో తనకు టిక్కెట్ ఇవ్వడం లేదని సుజాతమ్మకు స్పష్టత వచ్చింది. దీంతోనే ఆలూరు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న గుమ్మనూరు జయరాం కూడా కోట్ల సుజాతమ్మకు టిక్కెట్ వద్దని, వీరభద్రగౌడ్‌కు ఇవ్వాలని చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. వీరభద్ర గౌడ్‌కు ఇస్తే అతనికి ఫండ్ కూడా ఇస్తానని భరోసా ఇచ్చినట్లు సమాచారం. టీడీపీ శ్రేయస్సు కాకుండా తన రాజకీయ స్వార్థం కోసమే జయరాం ఈ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. సుజాతమ్మకు టిక్కెట్ ఇస్తే గెలిచినా, ఓడినా నియోజకవర్గం ఆమె చేతిలోనే ఉంటుందని, వీరభద్రగౌడ్‌కు టిక్కెట్ ఇప్పిస్తే ఎలాగూ ఓడిపోతాడని.. అప్పుడు నియోజకవర్గం తన చేతుల్లో ఉంటుందనేది ఆయన ఆలోచనగా చర్చ జరుగుతోంది. ఆ తర్వాత భవిష్యత్తులో తమ కుటుంబానికే ఆ టిక్కెట్ ఇప్పించుకునే అవకాశం ఉంటుందని జయరాం ఎత్తుగడగా తెలుస్తోంది. మరోవైపు గౌడ్‌కు టిక్కెట్ ఇస్తే తాము సహకరించబోమని వైకుంఠం మల్లిఖార్జున చౌదరి, శివజ్యోతి, ప్రసాద్ అధిష్టానికి చెప్పినట్లు సమాచారం. ముఖం చెల్లక.. కోట్ల కుటుంబమే కాదు.. భూమా, కేఈ కుటుంబాలకు కూడా చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతోనే భూమా బ్రహ్మానందరెడ్డి, కేఈ ప్రభాకర్ కూడా టిక్కెట్ దక్కకపోవడంతో పార్టీలో మొక్కుబడిగా కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, అభ్యర్థులతో పాటు తిరగలేకపోతుండటం గమనార్హం. -
అసలుకే ఎసరు పెట్టిన లోకేష్ యాత్ర.. టీడీపీలో కొత్త ట్విస్టులు!
నారా లోకేష్ పాదం మోపుతున్న ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీలో గ్రూపులు బయటపడుతున్నాయి. ఒకచోట ఫ్లెక్సీల గొడవ, మరోచోట ఆధిపత్య పోరు.. ఇలా ప్రతీ చోటా ఏదో ఒక తలనొప్పి లోకేష్‌ను ఇబ్బంది పెడుతోంది. కర్నూల్ జిల్లాలో సాగుతున్న పాదయాత్ర అక్కడి టీడీపీని మరింత బలహీనపరుస్తోందని చెబుతున్నారు. ఇంతకీ కర్నూల్ పచ్చ పార్టీలో ఏం జరుగుతోంది..? పాతాళంలో ఉన్న తెలుగుదేశం పార్టీని పైకి తీసుకొద్దామని నారా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే ఎక్కడికక్కడ గ్రూపులు బయటపడి పార్టీని మరింత బలహీనపరుస్తున్నాయట. ప్రస్తుతం ఉమ్మడి కర్నూల్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి నేతల్లో ఉత్సాహం ఏమాత్రం కనిపించడంలేదు. ఏ నియోజకవర్గంలో లోకేష్ కాలు పెడుతున్నాడో ఆ నియోజకవర్గంలో నాయకుల మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయి. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ని మార్చాలంటూ కరపత్రాలను పంచగా.. ఆలూరు నియోజకవర్గంలో తమకు ఈ ఇన్ఛార్జ్ వద్దంటూ ప్లెక్సీల ద్వారా నారా లోకేష్‌కు అక్కడి నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. ఆలూరు నియోజకవర్గంలో మొదటి నుండి నాలుగు వర్గాలుగా కొనసాగుతున్న నాయకులు ఎవరి ఇష్టం మేరకు వారు నడుచుకుంటున్నారు. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మ మాత్రం అందర్నీ కలుపుకునిపోతేనే వచ్చే ఎన్నికల్లో తనకు సీటు వస్తుందనే ఆశతో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అసమ్మతి వర్గం మాత్రం సుజాతమ్మకు వ్యతిరేకంగా మహాకూటమిగా ఏర్పడి సుజాతమ్మకు టికెట్ ఇవ్వద్దని ఎలుగెత్తి చాటుతున్నారు. సుజాతమ్మను వ్యతిరేకిస్తున్న ఆ మూడు గ్రూపుల్లో మాలో ఎవరికి ఇచ్చినా ఫర్వాలేదు.. కలిసి పనిచేసి గెలిపించుకుంటాం.. సుజాతమ్మకు మాత్రం టిక్కెట్ ఇవ్వడానికి వీల్లేదని లోకేష్‌కు తేల్చి చెప్పారట. నారా లోకేష్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు. అసమ్మతి వర్గం మాత్రం తమ బలాన్ని నిరూపించుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు. కోట్ల సుజాతమ్మ సీటు తనకే ఇస్తారని ధీమాగా ఉన్నారు. ఒక పార్టీ ముఖ్య నాయకుడు పాదయాత్ర చేస్తున్నాడంటే.. ప్రజల సమస్యలు వింటాడని, పార్టీలో సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతాడని అందరూ ఆశిస్తారు. అయితే, ప్రాంతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాత్రం ఎక్కడ పాదం మోపితే అక్కడ పార్టీ మరింత వీక్ అవుతోందనే టాక్ నడుస్తోంది. అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న గ్రూపులు లోకేష్ కనిపించగానే బయటికొస్తున్నాయి. ఒకవైపు పొగడ్తలు.. మరోవైపు నిరసనలతో యువగళం కాస్తా నిరసనగళంగా మారుతోంది. -
అలా కుదరదు.. లోకేష్‌కు షాకిచ్చిన టీడీపీ కార్యకర్తలు!
సాక్షి, కర్నూలు: టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర కర్నూలుకు చేరుకుంది. ఈ క్రమంలో లోకేష్‌కు టీడీపీ స్థానిక నేతలు ట్విస్ట్ ఇచ్చారు. పాదయాత్ర సందర్బంగా టీడీపీలో వర్గపోరు మరింత ముదిరింది. స్థానిక నేతల మధ్య ఉన్న విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. ఆలూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రకు వర్గ విభేదాలతో టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. కాగా, లోకేష్ పాదయాత్ర సందర్బంగా ఫ్లెక్సీల గొడవ షురూ అయ్యింది. ఆలూరులో ఫ్లెక్సీల రగడ చోటుచేసుకుంది. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మ ఫొటో ఫ్లెక్సీలు కట్టాలని లోకేష్.. టీడీపీ కార్యకర్తలకు సూచించారు. అయితే, సుజాతమ్మ ఫొటోతో ఉన్న ఫ్లెక్సీలను కట్టే ప్రస్తకేలేదని అసమ్మతి నేతలు తేల్చి చెప్పారు. దీంతో, వారి సమాధానం విని లోకేష్ బాబు ఖంగుతిన్నట్టు సమాచారం. ఈ క్రమంలో అసమ్మతి నేతలు కట్టిన ఫ్లెక్సీల్లో సుజాతమ్మ.. తన ఫొటోను అతికించుకున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీల విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
కోట్ల, కేఈ కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు
సాక్షి, కర్నూలు: ఎన్నికల్లో వరుస పరాజయాలను మూట కట్టుకుంటున్న తెలుగుదేశం పార్టీకి జిల్లాలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. బలమైన వైఎస్సార్సీపీని ఎదుర్కొనలేక కుదేలైన టీడీపీ లో తాజాగా ఆ పార్టీ నేతల మధ్య నెలకొన్న అంతర్యుద్ధంతో ముసలం మొదలైంది. జిల్లా రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్న కేఈ, కోట్ల కుటుంబాల మధ్య మళ్లీ ఆధిపత్యపోరు రగిలింది. కొన్ని దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న రెండు కుటుంబాలు.. రెండేళ్ల క్రితం టీడీపీ వేదికగా కలిసి పని చేసినా వైఎస్సార్సీపీ ప్రభంజనంతో ఘోర ఓటమి ఎదురైంది. తాజాగా రాజకీయ ఉనికిలో భాగంగా ఎవరికి వారు ఆధిపత్యపోరుతో సొంత పార్టీలోనే కుంపటి రగిల్చారు. ఈ పంచాయితీ ఏకంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లడం, ఇరువర్గాలకు ఆయన చేసిన సూచనలతో ఇటు కోట్లతో పాటు కేఈ వర్గం కూడా డీలా పడింది. ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా కోట్ల సుజాతమ్మ కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల అనంతరం కూడా పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించారు. అయితే ఇటీవల కేఈ ప్రభాకర్ ఆలూరు నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. హాలహర్వి మండలం అమృతాపురం మారెమ్మ గుడిలో మొక్కు ఉందనే కారణంతో భారీగా టీడీపీ శ్రేణులకు విందు ఇచ్చారు. ఈ విందు నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తల పరిచయ వేదికగా ప్రభాకర్ మలుచుకున్నారు. ఆపై దేవనకొండ మండలంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆలూరుకు పదే పదే వస్తున్నారు. ఇక్కడి టిక్కెట్ ఆశిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నిస్తే ‘పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా!’ అని బదులిచ్చారు. దీంతో ఆలూరు టిక్కెట్ ఆశావహుల జాబితాలో తాను కూడా ఉన్నానని చెప్పకనే చెప్పినట్లయింది. ఆ తర్వాత కూడా ఈ నియోజకవర్గంలోని కీలక నేతలను పిలిపించుకుని మాట్లాడటం, వచ్చే ఎన్నికల్లో తాను ఆలూరు బరిలో ఉంటానని, అందరూ సహకరించాలని కోరుతున్నారు. కోట్ల కుటుంబానికి ఒక సీటే? కేఈ ప్రభాకర్ వ్యాఖ్యల నేపథ్యంలో సుజాతమ్మ చంద్రబాబును కలిశారు. జిల్లా రాజకీయ పరిస్థితులు వివరిస్తూ ఆలూరు అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆలూరులో జోక్యం చేసుకుంటున్నారని, పార్టీ తరఫున ఆయన జోక్యాన్ని అరికట్టేలా ఆదేశించాలని కోరినట్లు తెలిసింది. దీనికి చంద్రబాబు బదులిస్తూ ‘ఆలూరు కంటే మీకు డోన్ బాగుంటుందని, డోన్ బాధ్యత మీకు అప్పగిస్తా’నని చెప్పినట్లు సమాచారం. 2004లో డోన్ ఎమ్మెల్యేగా గెలిచావని, నియోజకవర్గంలో పరిచయాలు కూడా ఉన్నందున డోన్ బాగుంటుందని సూచించినట్లు తెలిసింది. అయితే ఎంపీగా తన భర్త కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీ చేస్తారు కాబట్టి, ఆలూరు అయితే పార్లమెంట్‌కు కూడా కలిసొస్తుందని చెప్పినా.. చంద్రబాబు ఆమె మాటను పెడచెవిన పెట్టి డోన్‌ను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆయన మాటల వెనుక వేరే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి కర్నూలు పార్లమెంట్ పరిధిలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కోట్ల కుటుంబానికి డోన్ ఇస్తే సూర్యప్రకాశ్‌రెడ్డి, సుజాతమ్మలో ఎవరు నిలబడినా పార్టీకి అభ్యంతరం లేదని, ఆ కుటుంబానికే ఒక సీటు మాత్రమే అనేది తేటతెల్లమవుతోంది. కేఈ ప్రతాప్‌కు టిక్కెట్టు లేనట్టే.. డోన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా 2014, 2019లో కేఈ ప్రతాప్ పోటీ చేశారు. 2014 ఎన్నికలకు ముందు వ్యాపారవేత్తగా ఉన్న ప్రతాప్ ఆర్థికంగా బాగా బలపడిన తర్వాత రాజకీయాలపై ఆసక్తి ఏర్పడి డోన్ టిక్కెట్ ఆశించారు. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తికి సోదరుడే కావడంతో ఆయన ప్రమేయంతో డోన్ టిక్కెట్ దక్కించుకున్నారు. అయితే రెండుసార్లు వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే 2024లో కోట్ల కుటుంబానికి డోన్ టిక్కెట్ ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉండటంతో ప్రతాప్‌కు టిక్కెట్టు దక్కనట్లేనని తెలుస్తోంది. నాలుగు దశాబ్దాలుగా రాజకీయ వైరం.. కేఈ, కోట్ల కుటుంబాల మధ్య నాలుగు దశాబ్దాలుగా రాజకీయ వైరం నడుస్తోంది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాం నుంచి కోట్ల కుటుంబం కాంగ్రెస్‌లో, కేఈ కుటుంబం టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ఉనికి లేకుండా పోయింది. ఈ క్రమంలో సూర్యప్రకాశ్‌రెడ్డి రాజకీయ ప్రత్యామ్నాయం లేక విధిలేని పరిస్థితిలో టీడీపీలో చేరారు. దీంతో కేఈ, కోట్ల కుటుంబాలు ఒకేపార్టీ వేదికగా పనిచేయాల్సి వచ్చింది. అయితే రెండేళ్లలోనే తిరిగి రెండు కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. ఇప్పటికే జిల్లాలోని రెండు ఎంపీ, 14 అసెంబ్లీ స్థానాల్లో ఘోర ఓటమితో టీడీపీ ఉనికి లేకుండా పోయింది. దీనికి తోడు అన్ని మునిసిపాలిటీలు, అన్ని మండల పరిషత్‌లతో పాటు జిల్లా పరిషత్ స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య రాజకీయ ప్రయాణం సాగిస్తోన్న తెలుగు తమ్ముళ్లకు కేఈ, కోట్ల కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆశించిన టిక్కెట్లు దక్కనపుడు రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీలో ఉంటూ, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని, అవి ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు గత 20 ఏళ్లలో టీడీపీ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పెద్ద ఫలితాలు సాధించలేదని, కర్నూలు జిల్లాలో అత్యంత బలహీనంగా టీడీపీ ఉందని, ఎవరు ఏ స్థానం ఆశించినా, ఎలాంటి మార్పులు చేర్పులు జరిగినా ఫలితాల్లో మాత్రం పెద్దగా మార్పు ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
కోట్ల సుజాతమ్మను నిలదీసిన గ్రామస్తులు
సాక్షి, కర్నూలు: జిల్లాలోని ఆలూరు మండలం కురుకుందలో టీడీపీ అభ్యర్థికి ఊహించని షాక్ తగిలింది. ప్రచారానికి వెళ్లిన కోట్ల సుజాతమ్మను గ్రామస్థులు నిలదీశారు. తాగునీటి సమస్య తీర్చకుండా ప్రచారానికి ఎందుకొచ్చారని ఓ పెద్దాయన ప్రశ్నించారు. ఆయనకు గ్రామప్రజలంతా మద్దతుగా మాట్లాడారు. టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మను నిలదీశారు. దీంతో వేదపతి ప్రాజెక్ట్ నిర్మించామని ఆమె మాటదాటేసే ప్రయత్నం చేసినా... గ్రామస్థులు వెనక్కి తగ్గలేదు. తాగునీటి సమస్య పరిష్కరించకుండా గ్రామానికి రావద్దని తెగేసి చెప్పారు. వారికి సమాధానం చెప్పలేక దాటవేసే ధోరణిలో కోట్ల సుజాతమ్మ ముందుకెళ్లిపోయారు. టీడీపీ సమావేశం రసాభాస పశ్చిమ గోదావరి : జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో టీడీపీ సమావేశం రసాభాసగా మారింది. చింతలపూడి నియోజకవర్గ పరిధిలో ఉన్న టీడీపీ అసమ్మతి వర్గాన్ని బుజ్జగించేందుకు ఏర్పాటు చేసిన సమావేశం అరుపులు, కేకలతో దద్దరిల్లింది. నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పీతల సుజాతను కాదని కర్రా రాజారావుకి టికెట్ ఇవ్వడంతో ఆమె వర్గం నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీంతో కర్రా రాజారావు తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీతల వర్గం నేతలు వేదికపైకి దూసుకొచ్చారు. -
టికెట్ లేదనడంతో టీడీపీ నేత కన్నీటి పర్యంతం..!
సాక్షి, కర్నూలు : టికెట్లు ఆశించి భంగపడ్డ టీడీపీ నాయకుడొకరు కన్నీటి పర్యంతమయ్యారు. ఆలూరు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వీరభద్రగౌడ్ బీసీ నాయకులను చంద్రబాబు పట్టించుకోవడంలేదని వాపోయారు. ఆలూరు టికెట్‌ను కోట్ల సుజాతమ్మకు కేటాయించడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. ఉన్నపళంగా తనకు టికెట్ లేదని చెప్పడంతో ఆయన కలత చెందారు. తన వర్గీయుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. బాబు ఇంత మోసం చేస్తాడనుకోలేదని వాపోయారు.కర్నూలు పార్లమెంట్ పరిధిలో అత్యంత కీలకైన బీసీ నాయకులను చంద్రబాబు కంటతడి పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న బీసీల కష్టాన్ని లెక్కచేయకుండా వలస నేతలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. బీసీలే నా దేవుళ్లు అని చెప్పుకునే చంద్రబాబు బీసీల రాజకీయ భవితవ్యానికి సమాధి కడుతున్నారని విమర్శించారు. -
ప్లీజ్.. ఆ ఒక్కటీ అడక్కు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికారం కోసం అర్రులుచాచి టీడీపీలో చేరిన నేతలకు గట్టి షాక్ తగిలింది. నిన్నటి వరకు తనకే సీటు అని ధైర్యంగా ఉన్న ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి ఆ ఒక్కటీ తప్ప.. ఏం కావాలో చెప్పాలంటూ సుజనా చౌదరి నేతృత్వంలోని కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఆయనకు ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితి ఏర్పడింది. టీజీ కుటుంబానికి ఎమ్మెల్సీ ఇచ్చి తనకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. అయినప్పటికీ కమిటీ ఒప్పుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పూర్తి దిగాలుగా.. ఏమి చేయాలో అర్థం కాక అమరావతిలోనే ఇంకా మకాం వేసినట్టు తెలుస్తోంది. మోహన్‌రెడ్డికి ఎమ్మెల్సీతో పాటు ఆయన సతీమణికి జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించినట్టు సమాచారం. మరోవైపు కర్నూలు సీటు టీజీ భరత్‌కే కేటాయించాలని అధికార పార్టీ నేతలు నిర్ణయించారు. ఇందుకు ప్రతిఫలంగా కర్నూలు పార్లమెంటు అభ్యర్థికి అయ్యే మొత్తం వ్యయాన్ని టీజీ భరించేలా ఒప్పందం కుదిరినట్టు ప్రచారం సాగుతోంది. ఆదోని సీటును బుట్టాకు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ.. మీనాక్షి నాయుడు సామాజిక వర్గమంతా వెళ్లి ఆ సామాజికవర్గానికి జిల్లాలో ఉన్న ఏకైక సీటును కచ్చితంగా ఇవ్వాలంటూ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఎంపీ బుట్టా రేణుకకు మొండిచేయి తప్పలేదని సమాచారం. ఇక గౌరు చరిత టీడీపీలో చేరడంతో మాండ్ర శివానందరెడ్డికి ఎంపీ సీటు కేటాయించే అవకాశం లేదన్న ప్రచారం ఊపందుకుంది. కేవలం నందికొట్కూరు సీటుకు అభ్యర్థిని నిర్ణయించే అధికారం మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తోంది. పాణ్యం ఇన్చార్జ్గా ఉన్న ఏరాసు ప్రతాపరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామనడంతో ఆయన కాస్తా చల్లబడ్డారు. ఇక నంద్యాల సీటును భూమా బ్రహ్మానందరెడ్డికే ఇవ్వాలని నిర్ణయించడంపై అటు ఏవీ సుబ్బారెడ్డి, ఇటు ఎంపీ ఎస్పీవై రెడ్డి వర్గాలు మండిపడుతున్నాయి. ఒకరికొకరు.. మొన్నటివరకు కోట్ల–కేఈ కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ నడిచింది. అయితే, కోట్ల కుటుంబం టీడీపీలో చేరిన తర్వాత సీట్ల విషయంలో ఒకరికొకరు అండగా నిలిచినట్టు తెలుస్తోంది. ఆలూరులో బీసీ నినాదం వల్ల కొంప మునుగుతుందని, కావున తనకు డోన్ టికెట్ కావాలని కోట్ల సుజాతమ్మ భావించారు. దీంతో కేఈ కృష్ణమూర్తి రంగంలోకి దిగి..ఆలూరులో వీరభద్రగౌడ్‌ను ఒప్పించడంతో పాటు మాజీ ఇన్చార్జ్ వైకుంఠం ప్రసాద్, మసాల పద్మజ కూడా సహకరించేలా చేస్తానని చెప్పారు. దీంతో డోన్ సీటును కేఈ ప్రతాప్‌కే వదులుకునేందుకు కోట్ల కుటుంబం సిద్ధపడినట్టు తెలుస్తోంది. అలాగే కోడుమూరు సీటు విష్ణువర్దన్‌రెడ్డి వర్గానికి కాకుండా కోట్ల వర్గానికే ఇవ్వాలని కూడా కేఈ కృష్ణమూర్తి గొంతు కలిపినట్టు సమాచారం. ఈ పరిణామాలను గమనించిన రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇన్ని రోజులుగా సామాన్య కుటుంబాలను ఫ్యాక్షన్ కోరల్లో బలిచేసిన రెండు కుటుంబాలు తమ వద్దకు వచ్చే సరికి సర్దుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు. -
కోట్ల కుటుంబం రహస్య మంతనాలు
సాక్షి, కర్నూలు : ఆలూరు నియోజకవర్గ అధికార పార్టీలో చిచ్చు కొనసాగుతోంది మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్ కేటాయిస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ అనుచరులు మండిపడుతున్నారు. బీసీ నేతను కాదని కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఆమెకు టికెట్ కేటాయిస్తే తాము ఓటు వేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. బీసీ వర్గానికి చెందిన వీరభద్ర గౌడ్‌ను కాదని కోట్ల సుజాతమ్మకు నియోజకవర్గ టికెట్ ఎలా కేటాయిస్తారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బీసీ నేతలంతా కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వొద్దంటూ నిరసన ర్యాలీ కూడా చేపట్టారు. మరోవైపు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా టీడీపీ అసమ్మతి నేతలతో కోట్ల కుటుంబం రహస్యంగా మంతనాలు జరుపుతోంది. అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా... టీడీపీ శ్రేణులు మాత్రం ససేమిరా అంటున్నాయి. కాగా జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో కోట్ల రాకను కేఈ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. -
కోట్ల సుజాతమ్మకు నిరసన సెగ..
సాక్షి, కర్నూలు: కోట్ల సుజాతమ్మకు ఆలూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగ మొదలైంది. కోట్ల సుజాతమ్మను ఆలూరు తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్ విషయంపై భగ్గుమంటున్నారు. ఆలూరు టికెట్ బీసీలకే కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వేరే సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయిస్తే సహించేది లేదని టీడీపీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ జయరాం, ఎంపీపీ పార్వతి తేల్చి చెప్పారు. కాగా జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో కోట్ల రాకను కేఈ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమతో కనీసం సంప్రదించకుండానే కోట్లతో నేరుగా సీఎం చర్చలు జరపడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు కర్నూలు ఎంపీతో పాటు ఆలూరు, డోన్ టికెట్లు తమకే వస్తాయని కోట్ల కుటుంబం తన అనుచరులతో భేటీ సందర్భంగా చెప్పుకుంటోంది. ఇది కాస్తా కేఈ కుటుంబానికి ఆగ్రహం తెప్పిస్తోంది. -
ఎస్వీకి ఝలక్.. కోట్లకు టికెట్ ?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రాకను ముందుగానే స్వాగతించిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి తమదైన శైలిలో ఝలక్ ఇచ్చేందుకు కేఈ సోదరులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఏకంగా ఎస్వీ టికెట్‌కే టెండర్ వేసేందుకు పావులు కదుపుతున్నారు. కోట్ల కుటుంబానికి కర్నూలు ఎంపీతో పాటు కర్నూలు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం ముందు కేఈ సోదరులు కొత్త ప్రతిపాదన చేశారు. పత్తికొండ, డోన్ టికెట్లు తమ కుటుంబానికే ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరినట్టు తెలిసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో కర్నూలు పరిధిలో కోట్లకు చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చిన అంశాన్ని వీరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు కూడా ఈ పరిణామం దోహదపడడమే కాకుండా ఇక్కడ పార్టీ గెలుపునకు ఉపయోగపడుతుందంటూ అధిష్టానం ముందు ప్రతిపాదన ఉంచనున్నట్టు సమాచారం. కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో ఇప్పటికే ఎమ్మెల్యే ఎస్వీ, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు భరత్ మధ్య ఉన్నపోటీని పరిష్కరించే వీలు కూడా కలుగుతుందనేది వీరి అభిప్రాయంగా ఉంది. ఈ నేపథ్యంలో కోట్ల రాకను స్వాగతించిన ఎస్వీకి అసలు సీటే లేకుండా చేయాలనేది కేఈ సోదరుల ప్రణాళికగా ఉన్నట్లు తెలుస్తోంది. డోన్, పత్తికొండ మాకే! జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో కోట్ల రాకను కేఈ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమతో కనీసం సంప్రదించకుండానే కోట్లతో నేరుగా సీఎం చర్చలు జరపడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు కర్నూలు ఎంపీతో పాటు ఆలూరు, డోన్ టికెట్లు తమకే వస్తాయని కోట్ల కుటుంబం తన అనుచరులతో భేటీ సందర్భంగా చెప్పుకుంటోంది. ఇది కాస్తా కేఈ కుటుంబానికి ఆగ్రహం తెప్పిస్తోంది. కాగా.. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి కేఈ కుటుంబం మొదటి నుంచి సహకరించింది. ఎంపీ టీజీ వెంకటేష్‌పై ఉన్న వ్యతిరేకత కొద్దీ ఎస్వీని ప్రోత్సహించింది. అలాగే పత్తికొండలో తమకు ఎస్వీ తన బంధువైన రామచంద్రారెడ్డి ద్వారా సహకరిస్తారని ఆశించింది. ఇందుకు భిన్నంగా కోట్ల రాకను ఎస్వీ స్వాగతించారు. కర్నూలులో మైనార్టీల్లో కోట్లకు అంతో ఇంతో పట్టుంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వీలుగా ఎస్వీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇన్నాళ్లూ ఉన్న కేఈ సోదరులను కాదని.. వారికి వ్యతిరేక వర్గమైన కోట్ల రాకను స్వాగతించారు. కోట్లతో కలసి సాగితే కర్నూలులో తనకు మైనార్టీ ఓటు బ్యాంకు ఏమైనా కలిసొస్తుందనే ఆలోచనతో ఉన్నారు. అయితే.. ఎమ్మెల్యే ఎస్వీ వైఖరిపై కేఈ వర్గం మండిపడుతోంది. ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్న చందంగా.. కోట్ల సుజాతమ్మను కర్నూలులో పోటీ చేయించే ప్రతిపాదన తెచ్చారు. తద్వారా డోన్ టికెట్‌ను తామే దక్కించుకోవడమే కాకుండా.. అటు టీజీ, ఇటు ఎస్వీలను దెబ్బతీయొచ్చన్నది వారి ఆలోచనగా ఉంది. మొత్తంగా అధికార పార్టీలో ఈ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేపుతున్నాయి. -
సుజాతమ్మా.. నిందలు వేయడం మానుకో
కర్నూలు, డోన్: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ శాసన సభ్యురాలు కోట్ల సుజాతమ్మ.. వైఎస్సార్సీపీ నాయకులపై నిందలు వేయడం మానుకోవాలని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హితవు పలికారు. తన గృహంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సుజాతమ్మకు ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె డోన్ నుంచి పోటీ చేయడంపై వైఎస్సార్సీపీకి ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. ఆమెపై దుష్ప్రచారం చేయాల్సిన అవసరం వైఎస్సార్సీపీకి లేదన్నారు. గత ఎన్నికల్లో ఆమె ఆలూరు నుంచి పోటీ చేశారని, డోన్ నియోజకవర్గంలో మాత్రం టీడీపీకి సహకరించాలని కార్యకర్తలకు సూచించారన్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తే.. సుజాతమ్మ మాత్రం నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే డోన్ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారనే విషయంపై ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. అరాచక పాలన కనిపించదా? రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న టీడీపీ నాయకులను పల్లెత్తు మాట మాట్లాడకుండా కేవలం వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఓడిస్తామని కోట్ల దంపతులు ప్రకటిస్తుండడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారని బుగ్గన అన్నారు. టీడీపీ అభ్యర్థుల విజయం కోసం వచ్చే ఎన్నికల్లో కోట్ల దంపతులు పోటీ చేస్తున్నారా అనే విషయంపై ప్రజలకు వివరణ ఇవ్వాలని బుగ్గన డిమాండ్ చేశారు. మిఠాయిలు పంచిందెవరో తెలియదా ? డోన్ కాంగ్రెస్ అభ్యర్థిగా కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తారని ప్రకటించిన వెంటనే టీడీపీ నాయకుడు ధర్మవరం సుబ్బారెడ్డి స్వీట్లు (మిఠాయిలు) పంపిణీ చేశారని, ఈ విషయం సుజాతమ్మకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని బుగ్గన అన్నా రు. వైఎస్సార్సీపీకి ద్రోహం చేసి, స్వప్రయోజనాల కోసం ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీలోకి చేరారన్నారు. ఆయన చేస్తున్న దుష్ప్రచారాన్ని కోట్ల దంపతులు ఎందుకు ఖండించడం లేదన్నారు. టీడీపీ నాయకుల అరాచకాలు, అవినీతి పనుల మూలంగా నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్సీపీకి వచ్చే ఎన్నికల్లో పట్టం గట్టడం ఖాయమని బుగ్గన ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో డోన్, ప్యాపిలి జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, దిలీప్ చక్రవర్తి, పార్టీ సీనియర్ నాయకుడు చిన్నకేశవయ్య గౌడ్, మండల, పట్టణ కమిటీ అధ్యక్షులు మల్లెంపల్లె రామచంద్రుడు, కోట్రికె హరికిషన్‌లు పాల్గొన్నారు. -
ఓటర్ల షాక్ తో 'కోట్ల'వారు సేద్యానికి ఓటేశారు!
రాష్ట్ర విభజన అంశం గత ఎన్నికల్లో ప్రజలిచ్చిన షాక్ తో కాంగ్రెస్ పార్టీ నేతల జాతకాలు తారమారయ్యాయి. కేంద్ర ప్రభుత్వంలో కీలక శాఖతోపాటు కర్నూలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి తాజా ఎన్నికల్లో దారుణమైన పరాజయం ఎదురవ్వడంతో ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. కర్నూలు రాజకీయ చరిత్రలో కోట్ల కుటుంబానికి ఊహించని ఓటమి ఎదుర్వడంతో దేశరాజధానిలోని అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. ఢిల్లీలో తన స్నేహితులకు భారీ విందును కూడా ఏర్పాటు చేశారు. ఈ విందుకు సుమారు ఓ 500 మందిని ఆహ్వానించారు కూడా. ఓటమి తర్వాత ఢిల్లీ నుంచి మకాం మార్చి కర్నూలులోని లద్దగిరికి సమీపంలో వెల్దుర్తిలో వ్యవసాయ పనుల్లో బిజీగా గడుపుతున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన వ్యవసాయాన్ని వదులుకోలేదని ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను 50 ఎకరాల్లో మామిడి తోటలో సేద్యం చేస్తున్నానని, 25 రకాల మామిడి పండ్లను పండిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆయన గతంలో రెండు ఆవులను కొన్నామని.. ప్రస్తుతం ఫామ్ హౌజ్ లో కనీసం 100 ఆవులన్నాయని తెలిపారు. అయితే రాజకీయంగా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న కోట్ల కుటుంబం.. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సతీమణి భార్య సుజాతమ్మ కూడా ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సీమాంధ్రలో పార్టీని కాంగ్రెస్ పణం పెట్టిందని.. అయితే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ లాభపడకపోవడం ఆయన ఆశ్యర్యం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పరిస్థితులు మారుతాయని కోట్ల అభిప్రాయం వ్యక్తం చేశారు. -
‘కోట్ల కుటుంబంతో పెట్టుకోకండి’
ఆలూరు: ‘కోట్ల కుటుంబంతో పెట్టుకోకండి. నాపై వ్యతిరేక వార్తలు రాస్తే మీ అంతు చూస్తాను’ అంటూ ఆలూరు సాక్షి విలేకరులను డోన్ మాజీ ఎమ్మెల్యే, కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి సుజాతమ్మ ఫోన్లో బెదిరించారు. ఈసారి కర్నూలు జిల్లా అలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమె కొన్ని ఫ్యాక్షన్ గ్రామాల్లో ఇటీవల పర్యటిస్తుండగా కొట్లాటలు జరిగాయి. ఈ కేసుల్లో స్థానిక పోలీసులు నిబంధనలు కాలరాసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వేధించారు. ఈ అంశంపై ఆధారాలతో సహా సాక్షి దినపత్రికలో మంగళవారం ‘కోట్లతో పోలీసులు మిలాఖత్, ‘పోలీస్ పవర్’ శీర్షికన వార్తలు ప్రచురితమయ్యాయి. వీటిపై కోట్ల సుజాతమ్మ ఉదయం 9.25 నుంచి 9.35 గంటల మధ్య 9849610231 నంబర్ నుంచి సాక్షి విలేకరులకు ఫోన్ చేశారు. ‘ఇలాంటి వార్తలు రాస్తే మీ అంతు చూస్తా’నని హెచ్చరించారు. మిమ్మల్ని కోర్టుకు ఈడుస్తానని అన్నారు. దీనిపై ఏపీయూడబ్ల్యూజే నాయకులు స్వరూప్ కుమార్, తదితరులు స్పందిస్తూ... వాస్తవాలు రాస్తే ఇలా బెదిరించడం సరికాదన్నారు. -
పోలీసు ‘పవర్’
ఆలూరు రూరల్, న్యూస్‌లైన్: అత్తారింట్లో ప్రజాదరణ కోల్పోయిన మహిళా నేత పుట్టింట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. భర్త కేంద్ర మంత్రి కాగా.. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విభజన నిర్ణయం నేపథ్యంలో ఆయనచే రాజీనామా చేయిస్తానని బహిరంగంగా స్థానిక ప్రజలకు మాటిచ్చిన ఆమె నిలబెట్టుకోలేకపోయారు. ఈ పరిస్థితుల్లో రాజకీయ భిక్ష పెట్టిన డోన్ నియోజకవర్గాన్ని కాదని.. ఆలూరు నియోజకవర్గానికి మకాం మార్చారు కోట్ల సుజాతమ్మ. రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టేందుకు సిద్ధమవడం తెలిసిందే. జిల్లా కాంగ్రెస్‌కు పెద్దదిక్కయిన కోట్ల కుటుంబం గెలుపు కోసం అధికార దర్పాన్ని పావుగా వాడుకుంటోంది. ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గంలో అధికారగణంతో పాటు పోలీసు శాఖ సైతం ఏకపక్షంగా వ్యవహరిస్తుండటం విస్తుగొలుపుతోంది. తప్పు ఎవరు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకోవడం పరిపాటిగా మారింది. ఫలితంగా పచ్చని పల్లెల్లో ఫ్యాక్షన్ చిచ్చు రగులుతోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే నీరజారెడ్డితో కోట్ల కుటుంబానికి రాజకీయ వైరం ఉంది. గతంలో సుజాతమ్మ సోదరుడు నీరజారెడ్డిని ఓడించేందుకు తెరవెనుక పావులు కదిపారు. ఆ తర్వాత కూడా పలు విషయాల్లో ఆమెకు వ్యతిరేకంగా కోట్ల తీసుకున్న నిర్ణయాలను నీరాజరెడ్డి బహిరంగంగా ఎండగట్టారు. వీటన్నింటి దృష్ట్యా రానున్న ఎన్నికల్లో సుజాతమ్మ ఓటమే ధ్యేయంగా నీరాజరెడ్డి తన రాజకీయ చతురత చాటుతారనే చర్చ జరుగుతోంది. దీంతో కోట్ల కుటుంబం ఆచితూచి అడుగులేస్తోంది. పోలీసులను తమ గుప్పిట్లో ఉంచుకుని ప్రత్యర్థులను అణచివేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రాబల్యం పెంచుకునేందుకు కుట్ర జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గెలుపొందేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆదివారం అరికెర గ్రామంలో చోటు చేసుకున్న ఘటన ఇందుకు బలం చేకూరుస్తోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య ఇక్కడ ఆధిపత్య పోరు సాగుతోంది. విషయం తెలిసీ కోట్ల సుజాతమ్మ ప్రత్యర్థి గ్రూపును వెంటబెట్టుకొని మరో గ్రూపు నివాసాల మధ్య ప్రచారానికి వెళ్లడం రాళ్ల వర్షానికి దారితీసింది. ఇదే అదనుగా పోలీసులు ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ వర్గీయులకు తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇవ్వడం గమనార్హం. సీఐ, ఎస్ఐలు ఇద్దరూ కాంగ్రెస్ అనుకూలురే ఆలూరు సీఐగా పని చేస్తున్న శంకరయ్య గతంలో వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో పని చేశారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. అదేవిధంగా హాలహర్వి ఎస్ఐ ధనుంజయ పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి ఎస్ఐగా పని చేస్తున్న సమయంలో కోట్ల కనుసన్నల్లో పని చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిరువురి గత చరిత్ర నేపథ్యంలోనే కోట్ల ఏరికోరి ఆలూరుకు రప్పించుకున్నట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అరికెర ఘటనలో వైఎస్ఆర్సీపీ వర్గీయులను మాత్రమే టార్గెట్ చేసుకోవడం అందుకు బలం చేకూరుస్తోంది. -
మేము పదవులకోసం పాకులాడటం లేదు : సుజాతమ్మ