![Villagers Question Kotla Sujathamma in Campaign - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/24/TDP41.jpg.webp?itok=stW_4EF2)
సాక్షి, కర్నూలు: జిల్లాలోని ఆలూరు మండలం కురుకుందలో టీడీపీ అభ్యర్థికి ఊహించని షాక్ తగిలింది. ప్రచారానికి వెళ్లిన కోట్ల సుజాతమ్మను గ్రామస్థులు నిలదీశారు. తాగునీటి సమస్య తీర్చకుండా ప్రచారానికి ఎందుకొచ్చారని ఓ పెద్దాయన ప్రశ్నించారు. ఆయనకు గ్రామప్రజలంతా మద్దతుగా మాట్లాడారు. టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మను నిలదీశారు. దీంతో వేదపతి ప్రాజెక్ట్ నిర్మించామని ఆమె మాటదాటేసే ప్రయత్నం చేసినా... గ్రామస్థులు వెనక్కి తగ్గలేదు. తాగునీటి సమస్య పరిష్కరించకుండా గ్రామానికి రావద్దని తెగేసి చెప్పారు. వారికి సమాధానం చెప్పలేక దాటవేసే ధోరణిలో కోట్ల సుజాతమ్మ ముందుకెళ్లిపోయారు.
టీడీపీ సమావేశం రసాభాస
పశ్చిమ గోదావరి : జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో టీడీపీ సమావేశం రసాభాసగా మారింది. చింతలపూడి నియోజకవర్గ పరిధిలో ఉన్న టీడీపీ అసమ్మతి వర్గాన్ని బుజ్జగించేందుకు ఏర్పాటు చేసిన సమావేశం అరుపులు, కేకలతో దద్దరిల్లింది. నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పీతల సుజాతను కాదని కర్రా రాజారావుకి టికెట్ ఇవ్వడంతో ఆమె వర్గం నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీంతో కర్రా రాజారావు తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీతల వర్గం నేతలు వేదికపైకి దూసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment