
కెట్ లేదని చెప్పడంతో ఆయన కలత చెందారు. తన వర్గీయుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.
సాక్షి, కర్నూలు : టికెట్లు ఆశించి భంగపడ్డ టీడీపీ నాయకుడొకరు కన్నీటి పర్యంతమయ్యారు. ఆలూరు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వీరభద్రగౌడ్ బీసీ నాయకులను చంద్రబాబు పట్టించుకోవడంలేదని వాపోయారు. ఆలూరు టికెట్‌ను కోట్ల సుజాతమ్మకు కేటాయించడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. ఉన్నపళంగా తనకు టికెట్ లేదని చెప్పడంతో ఆయన కలత చెందారు. తన వర్గీయుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. బాబు ఇంత మోసం చేస్తాడనుకోలేదని వాపోయారు.కర్నూలు పార్లమెంట్ పరిధిలో అత్యంత కీలకైన బీసీ నాయకులను చంద్రబాబు కంటతడి పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న బీసీల కష్టాన్ని లెక్కచేయకుండా వలస నేతలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. బీసీలే నా దేవుళ్లు అని చెప్పుకునే చంద్రబాబు బీసీల రాజకీయ భవితవ్యానికి సమాధి కడుతున్నారని విమర్శించారు.