సాక్షి, విజయవాడ: రాజకీయ కక్షతోనే విజయవాడ సీపీపై బదిలీ వేటు పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును విజయవాడ సీపీ కాంతిరాణా దర్యాప్తు చేస్తున్నారు. అయితే విచారణ చేస్తున్న కాంతిరాణాపై కక్షతో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఐపీఎస్ అధికారులపై తప్పుడు ఫిర్యాదులతో కూటమి బ్లాక్‌మెయిల్ చేసింది.
ఈ క్రమంలో ష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీని బదిలీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో ఇప్పటికే వేముల సతీష్ అరెస్టయ్యారు. టీడీపీ నేత బోండా ఉమకు వేముల సతీష్‌అనుచరుడిగా ఉన్నారు. విచారణ కీలక దశలో ఉండగా సీపీ కాంతిరాణా బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment