గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిశారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న తప్పుడు ప్రచారంపై ఆయన సీపీకి ఫిర్యాదు చేశారు. తనను కించపరిచేలా ఆడపిల్లల పేర్లుతో ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఎమ్మెల్యే వంశీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘టీడీపీ సోషల్ వింగ్ పేరుతో సర్క్యులేట్ చేసినట్లు మా దృష్టికి వచ‍్చింది.