జూరాల ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న వరద
జూరాల : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లోపై ప్రభావం పడింది. శనివారం ఉదయం నుంచి జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు 1,10,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. కష్ణానది వరద శాంతించడంతో పుష్కరఘాట్లలో భక్తులు స్నానమాచరించేందుకు నీటిమట్టాలు అందుబాటులో ఉన్నాయి. జూరాల ప్రాజెక్టు నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.08టీఎంసీల నీటినిల్వ ఉంది. దిగువ నదిలోకి క్రస్టుగేట్లు విద్యుదుత్పత్తి ద్వారా 1,52,180 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. కర్ణాటకలో కష్ణానదిపై ఉన్న ఆల్మట్టి పాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72టీఎంసీలు కాగా 109టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. పై నుంచి ఇన్‌ఫ్లో 1,87,196 క్యూసెక్కులు వస్తుండగా విద్యుదుత్పత్తి ద్వారా 45వేల క్యూసెక్కుల వరదను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు దిగువన కర్ణాటకలో ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64టీఎంసీలు ప్రస్తుతం 30టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. పై నుంచి 1,02,987 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద వస్తుండగా ప్రాజెక్టులో 19క్రస్టుగేట్లను ఎత్తి జూరాల రిజర్వాయర్‌కు 79,948 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. ∙