గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రకాశం జిల్లాలో క్రైమ్ రేటు తగ్గిందని జిల్లా ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు.
ఒంగోలు : గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రకాశం జిల్లాలో క్రైమ్ రేటు తగ్గిందని జిల్లా ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ఆయన మంగళవారం జిల్లాలో క్రైమ్ రేటు వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రత్యక్షంగా సమాచారం ఇవ్వలేని వారి కోసం పోలీస్ ఫేస్బుక్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పోలీస్ ఫేస్బుక్ ద్వారా సమాచారం ఇచ్చినా పోలీసు స్పందిస్తారని ఆయన చెప్పారు. ఒంగోలులో ట్రాఫిక్ నియంత్రణకు ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేకపోవటం బాధాకరమన్నారు. ప్రకాశం జిల్లా నేర నియంత్రణ కోసం ప్రజల సహకరించాలని ఎస్పీ శ్రీకాంత్ పిలుపునిచ్చారు.