
ఆషాడం ముగిసింది.. శ్రావణ మాసం వచ్చేసింది. ఇక బంగారం పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే ఈ రోజు మాత్రం పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. దీంతో నిన్నటి ధరలే ఈ రోజు కొనసాగాయి. దేశ వ్యాప్తంగా ఈ రోజు (ఆగష్టు 5) బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం.
విజయవాడ, హైదరాబాద్‌లలో ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64700 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 70580 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉన్నాయి.
చెన్నైలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 200 (22 క్యారెట్స్), రూ. 220 (24 క్యారెట్స్) పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64700 కాగా, 24 క్యారెట్స్ తులం పసిడి ధర రూ. 70580 వద్దకు చేరాయి.
దేశ రాజధాని నగరంలో బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 64850 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70730 వద్ద ఉంది.
వెండి ధరలు
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఆదివారం స్థిరంగా ఉన్న సిల్వర్ సోమవారం రూ. 200 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 85,700లకు చేరింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).