
రూ.70,000 దాటేసిన తులం బంగారం ధర మెల్లగా తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా చుక్కలుతాకిన పసిడి.. రెండూ రోజు స్వల్పంగా తగ్గింది. దీంతో ధరల్లో మార్పులు జరిగాయి. కాబట్టి నేడు (సెప్టెంబర్ 30) దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా సోమవారం పసిడి ధరలు వరుసగా రూ. 150 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 160 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. దీంతో తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 70,800 వద్ద, 24 క్యారెట్ల పసిడి ధర రూ.77,240 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే.. చెన్నైలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70,800 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 77,240గా ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి కంటే కూడా రూ. 150, రూ. 160 తగ్గినట్లు స్పష్టమవుతోంది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 70,950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.77,390 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు ఈ రోజు వరుసగా రూ. 150, రూ. 160 తగ్గింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.
ఇదీ చదవండి: రేపటి నుంచే కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతాయి
వెండి ధరలు
బంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గింది. నిన్న రూ. 1,01,000 వద్ద ఉన్న వెండి ధర ఈ రోజు రూ. 100 తగ్గింది. దీంతో సిల్వర్ రేటు రూ. 1,09,000 వద్దకు చేరింది. ఇదే ధరలు దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఉండే అవకాశం ఉంటుంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).