
బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. కేవలం రెండు రోజుల్లోనే తులం గోల్డ్ రేటు ఏకంగా రూ. 1740 పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చింది. దేశంలోని దాదాపు అన్ని నగరాల్లోనూ ఇదే వరుస కొనసాగుతోంది. ఈ రోజు (సెప్టెంబర్ 14) బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
హదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా శనివారం పసిడి ధరలు వరుసగా రూ. 400 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 440 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. దీంతో తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 68650 వద్ద, 24 క్యారెట్ల పసిడి ధర రూ.74890 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే.. చెన్నైలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68650 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 74890గా ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి కంటే కూడా రూ. 400, రూ. 440 పెరిగినట్లు స్పష్టమవుతోంది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 68800 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.75040 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 1200, రూ. 1300 పెరిగిన గోల్డ్ రేటు ఈ రోజు వరుసగా రూ. 400, రూ. 440 పెరిగింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.
వెండి ధరలు
బంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా పెరిగాయి. నిన్న రూ. 89,500 వద్ద ఉన్న వెండి.. ఈ రోజు రూ. 2500 పెరుగుదలతో రూ. 92000 (కేజీ) వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కూడా ఉంటాయి. ధరలు ఇలాగే కొనసాగితే.. కేజీ సిల్వర్ రేటు లక్ష రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి.. చుక్కలు తాకిన కొత్త ధరలు!
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).