జులై ప్రారంభం నుంచి స్వల్పంగా పెరుగుతూ వచ్చి నిన్న ఒకేసారి పైకి లేచిన బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. దీంతో నిన్నటి ధరలే ఈ రోజు (జులై 5) కూడా కొనసాగుతాయి. నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67000 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73090 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.
ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67150 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73240 వద్ద ఉంది.
హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో మాత్రమే కాకుండా చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 67600.. కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 73750 వద్ద ఉంది.
వెండి ధరలు
బంగారం ధరలు స్థిరంగా ఉన్నా.. వెండి ధర మాత్రం అస్సలు తగ్గనంటోంది. దీంతో ఈ రోజు (జులై 5) కూడా వెండి ధర రూ. 200 పెరిగింది. దీంతో కేజీ ధర రూ. 93200 వద్ద ఉంది. జులై ప్రారంభం నుంచి వెండి ఏకంగా రూ. 3200 పెరిగింది. ఈ ధరలు ఇలాగే కొనసాగితే కేజీ వెండి లక్ష రూపాయలకు చేరుతుందని స్పష్టమవుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment