పసిడి ధరలు మళ్ళీ పైపైకి చేరుతున్నాయి. మొన్నటి వరకు స్వల్పంగా తగ్గుముఖం పట్టి కొనుగోలుదారులకు ఊరట కలిగించిన పసిడి మళ్ళీ షాకిచ్చింది. ఈ రోజు (జూన్ 7) కూడా గోల్డ్ రేటు పెరుగుదల దిశగా అడుగులు వేసింది. వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.67600 (22 క్యారెట్స్), రూ.73750 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 పెరిగినట్లు తెలుస్తోంది.
చెన్నైలో కూడా బంగారం ధరలు అమాంతం పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 68400 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 74620 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. గోల్డ్ రేట్లు వరుసగా రూ. 400, రూ. 440 వరకు పెరిగినట్లు స్పష్టమవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు పెరిగాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 పెరిగింది. దీంతో నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67750, కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 73900గా ఉంది.
వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు మాదిరిగానే వెండి కూడా పెరిగింది. ఈ రోజు (జూన్ 7) కేజీ వెండి ధర రూ. 96000 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు ఏకంగా రూ. 2500 ఎక్కువని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే కేజీ వెండి ధర త్వరలో రూ. లక్షకు చేరుతుందని తెలుస్తోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment