ఆగష్టు నెల ప్రారంభం నుంచి పడుతూ లేస్తూ ఉన్న బంగారం ధరలు రెండు రోజులుగా మళ్ళీ పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు పసిడి ధరలు గరిష్టంగా రూ.220 పెరిగింది. దీంతో బంగారం ధరలలో స్వల్ప కదలికలు ఏర్పడ్డాయి. ఈ కథనంలో దేశ వ్యాప్తంగా ఈ రోజు (ఆగష్టు 10) గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయనేది వివరంగా తెలుసుకుందాం.
విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64450 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 70310 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 పెరిగింది.
తెలుగు రాష్ట్రాలలో మాదిరిగానే చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 200, రూ. 220 పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64450 కాగా, 24 క్యారెట్స్ తులం పసిడి ధర రూ. 70310 వద్దకు చేరాయి.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 64600 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70460 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలకంటే కూడా ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 పెరిగిందని స్పష్టమవుతోంది.
వెండి ధరలు
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా కొంత పెరిగాయి. శుక్రవారం రూ. 1500 పెరిగిన వెండి, శనివారం రూ. 100 పెరిగింది. దీంతో వెండి రేటు రూ. 83100కు చేరింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment