బంగారం తర్వాత భారతీయులు వినియోగించే అత్యంత విలువైన లోహం వెండి. ఓ వైపు చుక్కలనంటుతున్న పసిడి ధరలతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతుండగా వెండి అంతకు మించిన వేగంతో కొండలా పెరుగుతోంది.
రానున్న 12 నుండి 15 నెలల్లో వెండి ధరలు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కేజీకి రూ. 1,25,000, కమోడిటీ ఎక్స్చేంజ్ (COMEX)లో ఔన్సుకు 40 డాలర్లకుచేరుకునే అవకాశం ఉందని ఆర్థిక సేవల సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MOFSL) తెలిపింది.
2024లో వెండి ఆకట్టుకునే వృద్ధిని కనబరిచింది. సంవత్సరానికి 40 శాతానికి పైగా పెరుగుదలను నమోదు చేసింది . దేశీయంగా రూ. 100,000 మార్కును అధిగమించింది. వినియోగం, డిమాండ్ పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక బంగారం ధరలు 10 గ్రాములకు స్వల్ప కాలంలో రూ. 81,000 లకు, దీర్ఘకాలికంగా రూ.86,000కి చేరుకుంటాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. అలాగే కమెక్స్‌లో బంగారం మీడియం టర్మ్‌లో 2,830 డాలర్లు, దీర్ఘకాలికంగా 3,000 డాలర్లను తాకుతుందని అంచనా వేస్తోంది.
ఇదీ చదవండి: బంగారమంటే అంత నమ్మకం!
ఇటీవలి సంవత్సరాలలో బంగారం స్థిరంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఆస్తులలో ఒకటిగా ఉంది. 2021 మినహా 2016 నుండి పసిడి దేశీయంగా మంచి పనితీరు కనబరుస్తూ వస్తోంది. ఈ సంవత్సరం బంగారం ధరలు కమెక్స్‌తోపాటు దేశీయ మార్కెట్‌లలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సంవత్సరానికి 30 శాతానికి పైగా వృద్ధిని సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment