Motilal Oswal report
-
బంగారాన్ని మించి.. దడ పుట్టిస్తున్న వెండి!
బంగారం తర్వాత భారతీయులు వినియోగించే అత్యంత విలువైన లోహం వెండి. ఓ వైపు చుక్కలనంటుతున్న పసిడి ధరలతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతుండగా వెండి అంతకు మించిన వేగంతో కొండలా పెరుగుతోంది.రానున్న 12 నుండి 15 నెలల్లో వెండి ధరలు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కేజీకి రూ. 1,25,000, కమోడిటీ ఎక్స్చేంజ్ (COMEX)లో ఔన్సుకు 40 డాలర్లకుచేరుకునే అవకాశం ఉందని ఆర్థిక సేవల సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MOFSL) తెలిపింది.2024లో వెండి ఆకట్టుకునే వృద్ధిని కనబరిచింది. సంవత్సరానికి 40 శాతానికి పైగా పెరుగుదలను నమోదు చేసింది . దేశీయంగా రూ. 100,000 మార్కును అధిగమించింది. వినియోగం, డిమాండ్ పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక బంగారం ధరలు 10 గ్రాములకు స్వల్ప కాలంలో రూ. 81,000 లకు, దీర్ఘకాలికంగా రూ.86,000కి చేరుకుంటాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. అలాగే కమెక్స్లో బంగారం మీడియం టర్మ్‌లో 2,830 డాలర్లు, దీర్ఘకాలికంగా 3,000 డాలర్లను తాకుతుందని అంచనా వేస్తోంది. ఇదీ చదవండి: బంగారమంటే అంత నమ్మకం!ఇటీవలి సంవత్సరాలలో బంగారం స్థిరంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఆస్తులలో ఒకటిగా ఉంది. 2021 మినహా 2016 నుండి పసిడి దేశీయంగా మంచి పనితీరు కనబరుస్తూ వస్తోంది. ఈ సంవత్సరం బంగారం ధరలు కమెక్స్‌తోపాటు దేశీయ మార్కెట్లలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సంవత్సరానికి 30 శాతానికి పైగా వృద్ధిని సాధించాయి. -
వచ్చే 12 నెలల్లో రూ.1,50,000కు చేరుకొనున్న బంగారం ధర..!
గత కొద్ది రోజులుగా బంగారం ధర రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. కేవలం గత 10 రోజుల్లోనే తులం బంగారం ధర వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది. ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడిపోవడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు, దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమౌతున్నందున ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపునకు మళ్లడమే డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, సమీప భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. "స్వల్పకాలిక అడ్డంకుల నుంచి దిద్దుబాటు కోసం ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి ఇలాగే కొనసాగితే రాబోయే 12-15 నెలల్లో బంగారం ధర కొత్త జీవిత కాల గరిష్టాలు $2,000(ఔన్స్‌కు) పైగా పెరిగే అవకాశం ఉన్నట్లు" మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విపీ - కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ పర్సన్ నవనీత్ దమాని చెప్పారు. ఒక ఔన్స్ 28.34 గ్రాములకు సమానం. అంటే, ఒక గ్రాము ధర రూ.5,252కు చేరుకోనుంది. ప్రస్తుతం బంగారం ధర భారతదేశంలో రూ.48,589(ప్రతి 10 గ్రాములకు) వద్ద ట్రేడవుతోంది. అమెరికాలో ప్రస్తుత బంగారం ధరలు $1840/ఔన్స్ వద్ద ఉన్నాయి. మోతీలాల్ ఓస్వాల్ నివేదిక 2021లో ప్రధాన ముఖ్యాంశాలలో ద్రవ్యోల్బణం ఒకటిగా ఉందని, వచ్చే ఏడాది కూడా ద్రవ్యోల్బణం పెరగవచ్చు అని ఈ నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణం వల్ల బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి అని నివేదిక స్పష్టం చేసింది. (చదవండి: కష్ట కాలంలో టోంగా దేశానికి అండగా స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్..!) -
ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో చిన్న సంస్థలకు భారీ అవకాశాలు
ముంబై: ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణతో చిన్న సంస్థలు, కొత్తగా ఇటువైపు అడుగుల వేసే కంపెనీలకు, స్టార్టప్‌లకు భారీ అవకాశాలు వచ్చిపడతాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తాజా నివేదిక ఒకటి పేర్కొంది. వాహన రంగంలో ఎలక్ట్రిఫికేషన్ (ఈవీకి మారడం) వేగం తీరు, పోటీ వాతావరణంపై అచ్చమైన ఈవీ కంపెనీల వ్యాల్యూషన్ ఆధారపడి ఉంటుందని తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్యాసింజర్ వాహనాల విభాగం వేగంగా ఈవీలకు మళ్లుతోందని కనుక.. అచ్చమైన ఈ–ప్యాసింజర్ కంపెనీలకు అధిక విలువ దక్కుతున్నట్టు విశ్లేషించింది. మధ్య తరహా, భారీ వాణిజ్య వాహన విభాగంలో ఎలక్ట్రిఫికేషన్ నిదానంగా ఉందని.. చిన్నపాటి వాణిజ్య వాహనాల్లో ఇది వేగంగా ఉన్నట్టు వివరించింది. 2026–27 నాటికి ద్విచక్ర వాహనాల్లో ఈవీల వాటా 15 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. స్కూటర్ల విభాగంలో ఈవీల వాటా ఇప్పటికే 35 శాతానికి చేరినట్టు వివరించింది. 2020–21 నాటికి ద్విచక్ర ఈవీల వాటా 1శాతంగానే ఉంది. ప్రభుత్వ సబ్సిడీలు ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. ప్యాసింజర్ వాహనాల ఎలక్ట్రిఫికేషన్ చాలా నిదానంగా ఉందని, ఫేమ్–2 పథకం కింద సబ్సిడీల్లేకపోవడం (వ్యక్తిగత వినియోగానికి), చార్జింగ్ సదుపాయాలు తక్కువగా ఉండడం ఇందుకు కారణంగా తెలిపింది. ‘‘ఎలక్ట్రిఫికేషన్‌తో సంప్రదాయ స్కూటర్ల విభాగానికి ముప్పు ఎక్కువగా ఉంది. దేశీ త్రిచక్ర వాహన విభాగంలో ఈవీ వాటా 2026–27 నాటికి 19 శాతానికి చేరొచ్చు. వాణిజ్య వాహనాల వాటా 23 శాతానికి, చిన్న పాటి వాణిజ్య వాహనాలు 18 శాతానికి చేరుకోవచ్చు’’ అని వివరించింది. ఆరంభంలోనే.. ఎలక్ట్రిక్ వాహన వినియోగంలో భారత్ ఇంకా ఆరంభ దశలోనే ఉన్నట్టు మోతీలాల్ ఓస్వాల్ నివేదిక తెలియజేసింది. ఎలక్ట్రిఫికేషన్ రిస్క్ దృష్ట్యా ద్విచక్ర వాహన స్టాక్స్‌కు డీరేటింగ్ ముప్పు ఉన్నట్టు తెలిపింది. ఈవీ వ్యాపారానికి సంబంధించి నిధులు సమీకరించిన కంపెనీలకు ఇప్పటికే మార్కెట్ మెరుగైన వ్యాల్యూషన్ ఇచ్చినట్టు పేర్కొంది. ఈవీల్లోకి అడుగుపెట్టిన ఓరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులకు (ఓఈఎం) సంబంధించి విలువ ఇంకా వెలుగుచూడాల్సి ఉందని తెలిపింది. చదవండి: మరోసారి తెరపైకి టాటా - ఎయిరిండియా డీల్..! -
నిఫ్టీ–500 స్టాక్స్‌లో డీఐఐల వాటా డౌన్
ముంబై: దేశీ స్టాక్స్‌లో ఓవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులకు దిగుతుంటే.. మరోపక్క దేశీ ఫండ్స్(డీఐఐలు) అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో గతేడాది (2020– 21) చివరి త్రైమాసికంలో నిఫ్టీ–500 ఇండెక్సులో భాగమైన కంపెనీలలో ఎఫ్‌పీఐల వాటా పుంజుకోగా.. డీఐఐల వాటా డీలా పడింది. వెరసి జనవరి–మార్చి(క్యూ4)లో డీఐఐల వాటా 0.5 శాతం క్షీణించి 14.2 శాతానికి పరిమితమైంది. ఇది గత 7 త్రైమాసికాలలో కనిష్టంకావడం గమనార్హం. ఇక ఇదే కాలంలో ఎఫ్‌పీఐల వాటా 1.6 శాతం బలపడి 22.3 శాతానికి చేరింది. బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ క్రోడీకరించిన గణాంకాలివి. ఇతర వివరాలు చూద్దాం.. క్యూ3తో పోలిస్తే వార్షికంగా చూస్తే నిఫ్టీ–500 స్టాక్స్‌లో ఎఫ్‌పీఐల వాటా 20.7 శాతం నుంచి 1.6 శాతం పుంజుకోగా.. డీఐఐల వాటా 14.7 శాతం నుంచి 0.5 శాతం క్షీణించింది. అయితే క్యూ3(అక్టోబర్–డిసెంబర్) తో పోలిస్తే ఎఫ్‌పీఐల వాటా 0.2 శాతం వెనకడుగు వేయగా.. డీఐఐల వాటా సైతం 0.1 శాతం నీరసించింది. క్యూ4లో ఎఫ్‌పీఐలు 7.3 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ఇదే సమయంలో డీఐఐలు 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. రంగాల వారీగా గత రెండు త్రైమాసికాలలో ఎఫ్‌పీఐలు టెలికం, మెటల్స్, కన్జూమర్ డ్యురబుల్స్, రియల్టీ, సిమెంట్ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వగా.. డీఐఐలు ఈ రంగాలలో అధిక అమ్మకాలు చేపట్టాయి. కన్జూమర్, హెల్త్‌కేర్, ప్రభుత్వ బ్యాంకులను పెట్టుబడులకు ఎంచుకున్నాయి. ఈ నేపథ్యంలో మార్చికల్లా ఎఫ్‌పీఐల వాటా 22.3 శాతానికి ఎగసింది. ఇది కోవిడ్–19 తలెత్తకముందు స్థాయికావడం గమనార్హం! గతేడాది ద్వితీయార్థంలో ఎఫ్‌పీఐలు నిఫ్టీ–500 ఇండెక్స్‌లోని 286 కంపెనీలలో వాటాలు పెంచుకున్నాయి. నిఫ్టీ–50లో 32 కంపెనీలున్నాయి. ఈ బాటలో డీఐఐలు 203–18(నిఫ్టీ) స్టాక్స్‌లో వాటాలు కొనుగోలు చేశాయి. ఇదే కాలంలో ఎఫ్‌పీఐలు 203–18 కంపెనీలలో వాటాలు తగ్గించుకోగా.. డీఐఐలు 271–31 స్టాక్స్ పెట్టుబడుల్లో వెనకడుగు వేశాయి. విలువ రీత్యా నిఫ్టీ–500 స్టాక్స్‌లో ఎఫ్‌పీఐల వాటా విలువ 593 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రయివేట్ బ్యాంక్స్‌లో ఎఫ్‌పీఐల పెట్టుబడుల విలువ 139 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు డీఐఐల వాటాల విలువ 378 బిలియన్ డాలర్లకు చేరగా.. ప్రయివేట్ బ్యాంక్స్‌లో పెట్టుబడులు 59 డాలర్లుగా నమోదయ్యాయి. ఈ బాటలో టెక్నాలజీ స్టాక్స్ వాటా విలువ 43 బిలియన్ డాలర్లను తాకగా, కన్జూమర్ విభాగంలో 40 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. ప్రయివేట్ బ్యాంక్స్‌లో ఎఫ్‌పీఐలు 47.9% ఓనర్‌షిప్‌ను కలిగి ఉన్నారు. ఈ బాటలో ఎన్బీఎఫ్సీలలో 32.9 శాతం, ఆయిల్, గ్యాస్‌లో 23.1 %, బీమాలో 22.2 శాతం, రియల్టీలో 21.5% ఓనర్‌షిప్‌ను పొందారు. డీఐఐలు క్యాపిటల్ గూడ్స్ (21.9%), ప్రయివేట్ బ్యాంక్స్(20.4%), మెటల్స్ (18.3%), కన్జూమర్ డ్యురబుల్స్ (17.8%), పీఎస్బీ(17.6%)లలో ఓనర్‌షిప్‌ను కలిగి ఉన్నాయి. ఇటీవల డీఐఐలు అత్యధికంగా(1 శాతానికిపైగా) వాటా పెంచుకున్న కంపెనీల జాబితాలో బీపీసీఎల్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చేరాయి. -
కరోనా ఎఫెక్ట్: పెరిగిన కుటుంబాల పొదుపు.. ఎంతంటే?
ముంబై: మహమ్మారి కరోనా వల్ల భారతీయులు 2020లో దాదాపు ఇళ్లకే పరిమితం కావడంతో కుటుంబాల పొదుపు రేటు పెరిగింది. స్థూల దేశీయోత్పత్తి విలువలో ఈ రేటు 22.5 శాతంగా నమోదయినట్లు బ్రోకరేజ్ సంస్థ-మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తాజా నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం 2019 జీడీపీతో పోల్చితే పొదుపు రేటు 19.8 శాతంగా ఉంది. జీడీపీ విలువలతో పోల్చి నివేదికలో పొందుపరచిన కొన్ని ముఖ్యాంశాలను, గణాంకాలను పరిశీలిస్తే... కఠిన లాక్డౌన్ అమల్లో ఉన్న ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో గృహాల పొదుపురేటు కేవలం 5.8 శాతంగా నమోదయ్యింది. మహమ్మారి ముందస్తు స్థాయితో పోల్చితే దాదాపు సగానికి సగం పడిపోయింది. నిత్యావసరాలకు భారీ వ్యయాలు, ఉపాధి అవకాశాలు దెబ్బతినడం వంటి అంశాలు దీనికి కారణం కావచ్చు. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25-ఏప్రిల్ 14, ఏప్రిల్ 15-మే 3, మే 4- మే 17, మే 18-మే 31) కఠిన లాక్డౌన్ అమలు ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4 శాతం), రెండు (-7.3 శాతం) త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు క్రమంగా తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. డిసెంబర్ త్రైమాసికంలో పొదుపు రేటు భారీగా రికవరీ అయ్యింది. పలు సంవత్సరాల గరిష్ట స్థాయిలో 13.7 శాతంగా నమోదయ్యింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కరెన్సీ రూపంలో పొట్టుబడులు పెరిగినా, డిపాజిట్లు, పెన్షన్లు, చిన్న పొదుపు పథకాల్లో పొదుపులు తగ్గాయి. డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంకింగ్ యేతర ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్ఎఫ్సీ)ల్లో రుణా భారాలను తగ్గించుకోడానికి కుటుంబాలు ప్రాధాన్యత ఇచ్చాయి. ఇదే సమయంలో బ్యాంకులు నుంచి రుణాలు పెరగడం గమనార్హం. కఠిన ఆంక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2020లో కుటుంబాల పొదుపురేట్లు పెరిగాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో పొదుపు పెరుగుదల రేటు తక్కువగా ఉంది. చదవండి: వాట్సాప్ అడ్మిన్‌కు ఊరట.. హైకోర్టు కీలక తీర్పు -
బ్యాంక్ ఆఫ్ బరోడా, గెయిల్ షేర్లను కొనవచ్చు: మోతీలాల్ ఓస్వాల్
ఐటీ, బ్యాంక్, ఇంధన షేర్ల జోరుకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు జత కావడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ వరుస రెండు రోజుల నష్టాలకు ముగింపు పలికింది. సెన్సెక్స్ 329 పాయింట్లు ఎగసి 35,171 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 10,383 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే ఇది వరుసగా నాలుగో లాభాల ముగింపు వారం. వారం మొత్తం మీద సెన్సెక్స్ 440 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. వచ్చే వారంలో నిఫ్టీకి అధిక గరిష్ట స్థాయిల వద్ద ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ రెండు స్టాకులను సిఫార్సుల చేసింది. 1.షేరు పేరు: బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.65 కాల పరిమితి: ఒక ఏడాది విశ్లేషణ: కోవిడ్-19 వ్యాప్తితో స్థూల ఆర్థిక వ్యవస్థలో సవాళ్లు నెలకొనవడంతో వృద్ధి, క్రెడిట్ నాణ్యత అవుట్‌లుక్‌లు ప్రభావితమయ్యాయి. ఆస్తుల వర్గీకరణ కలిసిరావడంతో ఈ త్రైమాసికలో బ్యాంక్ నాణ్యమైన అసెట్ క్వాలిటీ నిష్పత్తులను, మెరుగైన ప్రొవిజనింగ్ కవరేజ్‌లను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రుణవ్యయం మరింత అధికంగా ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ నిపుణులు అంచనా వేసింది. షేరు పేరు: గెయిల్ బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.110 కాల పరిమితి: ఒక ఏడాది విశ్లేషణ: గెయిల్ ప్రధాన సరఫరా వ్యాపారాలైన పెట్రోకెమికల్స్, ఎల్పీజీ, లిక్విటిడీ హెడ్రోకార్బన్ విభాగాలు ఈ మార్చి త్రైమాసికంలో అంచనాలు మించి ఫలితాలను సాధించినట్లు మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. -
అటో రంగ రికవరీ మరింత ఆలస్యం: మోతీలాల్ ఓస్వాల్
భారీగా పెరిగిన ఇంధన ధరలు అటో రంగ రికవరీ మరింత ఆలస్యం చేస్తాయని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. బీఎస్-VI సంబంధిత వ్యయ ద్రవ్యోల్బణం, ఇంధన ధరల హెచ్చు తగ్గులు వినియోగదారుల ప్రాధాన్యతలను మరింత ప్రభావితం చేస్తాయి. అయితే ద్విచక్రవాహనాలకు మాత్రం డిమాండ్ కొనసాగుతుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఇటీవలి పరోక్ష పన్నుల పెరుగుదలతో మొదటిసారిగా డీజిల్ ధరలు... పెట్రోల్ ధరలతో సమానంగా పోటీపడి పెరుగుతున్నాయనే ఈ సందర్భంగా బ్రోకరేజ్ సంస్థ గుర్తు చేసింది. పెట్రోల్, డీజిల్ మధ్య 2012 జూన్‌లో వ్యత్యాసం రూ.32లుగా ఉండేంది. 2015 జూలైలో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం రూ.21కి తగ్గించింది. ప్రస్తుతం సమానంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే డీజీల్‌తో నడిచే వక్తిగత వాహన పరిశ్రమకు డిమాండ్ భారీగా తగ్గిందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. వినియోగదారు ప్రాధాన్యత అనే అంశం ‘‘ఇంధనాల మధ్య ధరల అంతరం, యాజమాన్యం మొత్తం వ్యయం’’ అధిక సంబంధాన్ని కలిగి ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈ 3షేర్లపై బుల్లిష్ వైఖరి మోతీలాల్ ఓస్వాల్ అటో సెకార్ట్ నుంచి 3షేర్లపై బుల్లిష్ వైఖరిని కలిగి ఉంది. ఈరంగంలో లార్జ్ క్యాప్ కంపెనీలైన మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటర్స్ షేర్లకు సిఫార్సు చేయగా, మిడ్-క్యాప్ రంగం నుంచి మదర్సన్ సుమీ షేరు రికమెండ్ చేస్తోంది. డిమాండ్ రికవరీ పరంగా అధిక విజిబిలిటీ, బలమైన పోటీత్వం స్థాయి, బలమైన బ్యాలెన్స్ షీట్ కలిగి ఉండటంతో ఈ కంపెనీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది -
‘సంపద’కు కేరాఫ్.. రిలయన్స్
న్యూఢిల్లీ: గడిచిన ఐదు సంవత్సరాల్లో... అంటే 2014–19 మధ్య వాటాదారులకు అత్యంత సంపదను సమకూర్చిన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నిలిచింది. ఈ కాలంలో ఈ కంపెనీ రూ.5.6 లక్షల కోట్ల మేర విలువను పెంచుకున్నట్టు ‘మోతీలాల్ ఓస్వాల్ వార్షిక సంపద సృష్టి అధ్యయనం 2019’ తేల్చింది. అధికంగా సంపద తెచ్చిపెట్టిన కంపెనీల్లో.. మొదటి 100 కంపెనీలు కలసి 2014–19 కాలంలో సమకూర్చిన సంపద రూ.49 లక్షల కోట్లుగా ఉంది. ‘‘ఏడేళ్ల విరామం తర్వాత మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ 2014–19 కాలంలో రూ.5.6 లక్షల కోట్ల విలువను సమకూర్చి అత్యధిక సంపద సృష్టికర్తగా అవతరించింది. చరిత్రలో ఇప్పటి దాకా ఇదే అత్యధిక రికార్డు’’ అని బుధవారం విడుదలైన ఈ నివేదిక పేర్కొంది. గత ఐదేళ్ల కాలంలో అత్యధికంగా, అత్యంత వేగంగా, నిలకడగా సంపద సమకూర్చిన టాప్ 3 కంపెనీలుగా ఆర్ఐఎల్, ఇండియా బుల్స్ వెంచర్స్, ఇండస్ఇండ్ బ్యాంకు నిలవగా... వేగంగా సంపద తెచ్చిపెట్టిన వాటిల్లో ఇండియాబుల్స్ వెంచర్స్ వరుసగా రెండోసారి మొదటి స్థానం సంపాదించడం గమనార్హం. ఈ షేరు గత ఐదేళ్లలో వార్షికంగా 78 శాతం కాంపౌండెడ్ రాబడులను తెచ్చిపెట్టింది. టాప్–10 సంపద సృష్టికర్తల్లో బజాజ్ ఫైనాన్స్ స్థానం ప్రత్యేకమని ఈ నివేదిక తెలిపింది. ఇండస్ ఇండ్ బ్యాంకు 2009–19 కాలంలో కాంపౌండెడ్‌గా 49 శాతం చొప్పున స్థిరంగా సంపదను సృష్టించింది. ఇక 2014–19 కాలంలో సెన్సెక్స్ కాంపౌండెడ్ వార్షిక రాబడి 12 శాతంగా ఉంది. అన్ని రకాల మార్కెట్ పరిస్థితుల్లోనూ ఈ కంపెనీలు సంపదను తెచ్చిపెట్టినట్టు నివేదిక తెలియజేసింది. ఫైనాన్షియల్ రంగం ముందంజ... ఫైనాన్షియల్ రంగం 2014–19 మధ్య కాలంలో అత్యంత సంపదను తెచ్చిపెట్టిన రంగంగా వరుసగా మూడో ఏడాది అగ్ర పథాన నిలిచింది. ప్రైవేటు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలే ఈ రంగాన్ని నడిపించాయి. కాకపోతే, ఇదే విభాగంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం వాటాదారుల సంపదకు నష్టం చేకూర్చాయి. టాప్ 100 సంపద సృష్టికర్తల్లో ప్రభుత్వరంగ సంస్థలు కేవలం తొమ్మిదే చోటు సంపాదించాయి. అవి ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఇంద్రప్రస్థ గ్యాస్, ఎల్ఐసీ హౌసింగ్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎన్బీసీసీ. 2014–19 మధ్య కాలంలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో మార్పుల ఆధారంగా ఈ గణాంకాలను మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ రూపొందించింది. శ్రీమంతుల సగటు సంపద రూ.3.6 కోట్లే విశ్రాంత జీవనానికి నెలకు రూ.93,000 స్టాండర్డ్ చార్టర్డ్ నివేదిక న్యూఢిల్లీ: దేశంలో సంపన్నుల సగటు ఐశ్వర్యం రూ.3.6 కోట్లేనని, విశ్రాంత జీవన కాలంలో ప్రతి నెలా వెచ్చించేందుకు వారికి రూ.93,000 మాత్రమే ఉంటున్నదని స్టాండర్డ్ చార్టర్డ్ ‘సంపద అంచనా నివేదిక 2019’ తెలియజేసింది. ఇందులో వర్ధమాన సంపన్నుల వద్ద సగటున రూ.1.3 కోట్లు, సంపన్నుల వద్ద రూ.2.6 కోట్లు, అధిక సంపన్నుల(హెచ్ఎన్డబ్ల్యూఐ) వద్ద రూ.6.9 కోట్ల మేర వారి రిటైర్మెంట్ నాటికి ఉంటుందని అంచనా వేసింది. ఈ లెక్కన ఒక్కో సంపన్నుని వద్ద రిటైర్మెంట్ సమయంలో ప్రతీ నెలా వ్యయం చేసేందుకు రూ.93,000 ఉంటుందని పేర్కొంది. ఈ నిధిని వారి కోరిక మేరకు సగటున నెలవారీగా వ్యయం చేస్తూ వెళితే మాత్రం వర్ధమాన సంపన్నులకు ఆరేళ్ల పాటు, సంపన్నులకు తొమ్మిదేళ్లు, హెచ్ఎన్డబ్ల్యూఐలకు ఐదేళ్ల పాటే సరిపోతుందని నివేదిక తెలిపింది. జీడీపీ వృద్ధి, వడ్డీ రేట్లు తదితర అంశాలతో ఎంత సంపదను సమకూర్చుకోగలరు? రిటైర్మెంట్ సమయంలో ప్రతినెలా ఎంత మొత్తంతో వారు జీవించగలరు? అనే గణాంకాలను ఈ సంస్థ రూపొందించింది. -
లక్షల కోట్లను సృష్టించిన టాప్-100 కంపెనీలు
దేశంలో టాప్-100 కంపెనీల మార్కెట్ విలువ రికార్డు స్థాయికి చేరింది. గత ఐదేళ్లలో ఈ కంపెనీలు రూ.38.9 లక్షల కోట్ల సంపదను సృష్టించినట్టు తాజా అధ్యయనంలో తేలింది. టాటా గ్రూప్ సంస్థ టీసీఎస్ వీటిలో టాప్‌లో నిలిచింది. వరుసగా ఐదేళ్ల నుంచి మార్కెట్ విలువలో టీసీఎస్ తొలి స్థానాన్ని దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. దిగ్గజ బ్రోకరేజ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ 22వ వార్షిక సంపద సృష్టి అధ్యయనంలో ఈ ర్యాంకింగ్‌లను వెల్లడించింది. 2012 నుంచి 2017 వరకు టీసీఎస్ రూ.2.50 లక్షల కోట్ల సంపదను సృష్టించినట్టు తెలిపింది. దీంతో మళ్లీ తొలి ర్యాంకింగ్‌నే దక్కించుకున్నట్టు పేర్కొంది. ఈ ఐటీ దిగ్గజం అనతరం, ప్రైవట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ రెండో స్థానంలో నిలిచింది. రూ.1.89 లక్షల కోట్ల సంపద సృష్టితో రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో స్థానాన్ని పొందింది. ఐటీసీ, మారుతీ సుజుకీలు నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచినట్టు మోతిలాల్ ఓస్వాల్ అధ్యయనం పేర్కొంది. 2012-17 కాలంలో అత్యంత వేగవంతంగా సంపదను పెంచుకున్న కంపెనీగా అజంత ఫార్మా ఉంది. వరుసగా మూడో సారి కూడా ఈ విషయంలో అజంత ఫార్మానే ముందజలో ఉంది. రంగాల పరంగా బ్యాంకింగ్, ఫైనాన్స్‌లు సంపదను సృష్టించడంలో తొలి స్థానాల్లో ఉన్నాయని, బ్యాంకింగ్ సెక్టార్ కన్జ్యూమర్, రిటైల్ ఇండస్ట్రీని రీప్లేస్ చేసినట్టు తెలిపింది. ఈ ఏడాది ఈ రెండు రంగాలు రెండో స్థానంలో నిలిచాయని తెలిసింది. -
ఐదేళ్లలో 28 లక్షల కోట్లు
• భారత టాప్ 100 కంపెనీలు సృష్టించిన సంపద • అగ్రస్థానంలో టీసీఎస్ మోతిలాల్ ఓస్వాల్ నివేదిక ముంబై: దేశంలోని అగ్రస్థాయి వంద కంపెనీల మార్కెట్ విలువ ఐదేళ్లలో జోరుగా పెరిగింది. 2011-16 కాలానికి ఈ కంపెనీలు రూ.28.4 లక్షల కోట్ల సంపదను సృష్టించాయని మోతిలాల్ ఓస్వాల్ రూపొందించిన తాజా నివేదిక వెల్లడించింది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొంది. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా, సంపద సృష్టి జరుగుతూనే ఉందని వివరించింది. ‘21వ వార్షిక సంపద సృష్టి నివేదిక’ పేరుతో మోతిలాల్ ఓస్వాల్ అందించిన వివరాల్లో ముఖ్యాంశాలు.., ⇔ కంపెనీల విలీనాలు, డీ-మెర్జర్, బై బ్యాక్, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని 2011-16 మధ్య కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్లో వచ్చిన మార్పులను ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ⇔ 2011-16 కాలానికి అధిక సంపదను సృష్టించిన కంపెనీగా టీసీఎస్ నిలిచింది. ఈ ఐదేళ్ల కాలంలో ఈ కంపెనీ రూ.2.6 లక్షల కోట్ల సంపదను సృష్టించింది. మార్కెట్ విలువ పెంచడంలో ఈ కంపెనీ వరుసగా నాలుగో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ⇔ టీసీఎస్ తర్వాతి స్థానాన్ని హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్ సాధించింది. ⇔ వేగంగా మార్కెట్క్యాప్ పెరిగిన కంపెనీగా అజంతా ఫార్మా నిలిచింది.ఇది ఈ ఘనత సాధించడం వరుసగా రెండోసారి. ⇔ అత్యంత నిలకడగా సంపద పెరిగిన కంపెనీగా ఏషియన్ పెయింట్స్ అవతరించింది. ⇔ రంగాల వారీగా చూస్తే కన్సూమర్/రిటైల్‌రంగం అత్యధిక సంపద సృష్టించిన రంగంగా వరుసగా రెండో ఏడాది నిలిచింది. ⇔ ఈ ఐదేళ్ల కాలంలో సంపద సృష్టిలో ప్రభుత్వ రంగ సంస్థలు దయనీయమైన స్థారుులో ఉన్నారుు. ⇔ మొత్తం వంద కంపెనీల్లో కేవలం ఏడు ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే చోటు దక్కింది. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, కాన్కర్, ఎల్ఐసీ హౌసింగ్, భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్‌గ్రిడ్‌లకు ఈ జాబితాలో చోటు దక్కింది. ⇔ మొత్తం సంపదలో ఈ ఏడు ప్రభుత్వ రంగ సంస్థల వాటా 4 శాతం మాత్రమే.