గత కొద్ది రోజులుగా బంగారం ధర రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. కేవలం గత 10 రోజుల్లోనే తులం బంగారం ధర వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది. ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడిపోవడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు, దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమౌతున్నందున ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపునకు మళ్లడమే డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి, సమీప భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. "స్వల్పకాలిక అడ్డంకుల నుంచి దిద్దుబాటు కోసం ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి ఇలాగే కొనసాగితే రాబోయే 12-15 నెలల్లో బంగారం ధర కొత్త జీవిత కాల గరిష్టాలు $2,000(ఔన్స్‌కు) పైగా పెరిగే అవకాశం ఉన్నట్లు" మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విపీ - కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ పర్సన్ నవనీత్ దమాని చెప్పారు. ఒక ఔన్స్ 28.34 గ్రాములకు సమానం. అంటే, ఒక గ్రాము ధర రూ.5,252కు చేరుకోనుంది.
ప్రస్తుతం బంగారం ధర భారతదేశంలో రూ.48,589(ప్రతి 10 గ్రాములకు) వద్ద ట్రేడవుతోంది. అమెరికాలో ప్రస్తుత బంగారం ధరలు $1840/ఔన్స్ వద్ద ఉన్నాయి. మోతీలాల్ ఓస్వాల్ నివేదిక 2021లో ప్రధాన ముఖ్యాంశాలలో ద్రవ్యోల్బణం ఒకటిగా ఉందని, వచ్చే ఏడాది కూడా ద్రవ్యోల్బణం పెరగవచ్చు అని ఈ నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణం వల్ల బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి అని నివేదిక స్పష్టం చేసింది.
(చదవండి: కష్ట కాలంలో టోంగా దేశానికి అండగా స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్..!)
Comments
Please login to add a commentAdd a comment