దేశంలో టాప్-100 కంపెనీల మార్కెట్ విలువ రికార్డు స్థాయికి చేరింది. గత ఐదేళ్లలో ఈ కంపెనీలు రూ.38.9 లక్షల కోట్ల సంపదను సృష్టించినట్టు తాజా అధ్యయనంలో తేలింది. టాటా గ్రూప్ సంస్థ టీసీఎస్ వీటిలో టాప్‌లో నిలిచింది. వరుసగా ఐదేళ్ల నుంచి మార్కెట్ విలువలో టీసీఎస్ తొలి స్థానాన్ని దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. దిగ్గజ బ్రోకరేజ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ 22వ వార్షిక సంపద సృష్టి అధ్యయనంలో ఈ ర్యాంకింగ్‌లను వెల్లడించింది. 2012 నుంచి 2017 వరకు టీసీఎస్ రూ.2.50 లక్షల కోట్ల సంపదను సృష్టించినట్టు తెలిపింది. దీంతో మళ్లీ తొలి ర్యాంకింగ్‌నే దక్కించుకున్నట్టు పేర్కొంది.
ఈ ఐటీ దిగ్గజం అనతరం, ప్రైవట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ రెండో స్థానంలో నిలిచింది. రూ.1.89 లక్షల కోట్ల సంపద సృష్టితో రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో స్థానాన్ని పొందింది. ఐటీసీ, మారుతీ సుజుకీలు నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచినట్టు మోతిలాల్ ఓస్వాల్ అధ్యయనం పేర్కొంది. 2012-17 కాలంలో అత్యంత వేగవంతంగా సంపదను పెంచుకున్న కంపెనీగా అజంత ఫార్మా ఉంది. వరుసగా మూడో సారి కూడా ఈ విషయంలో అజంత ఫార్మానే ముందజలో ఉంది. రంగాల పరంగా బ్యాంకింగ్, ఫైనాన్స్‌లు సంపదను సృష్టించడంలో తొలి స్థానాల్లో ఉన్నాయని, బ్యాంకింగ్ సెక్టార్ కన్జ్యూమర్, రిటైల్ ఇండస్ట్రీని రీప్లేస్ చేసినట్టు తెలిపింది. ఈ ఏడాది ఈ రెండు రంగాలు రెండో స్థానంలో నిలిచాయని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment