సాక్షి, ముంబై: అప్పుల ఊబిలోంచి బయటపడేందుకు టాటా సన్స్ లిమిటెడ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టిసిఎస్) నుంచి భారీ వాటాను టాటా గ్రూపు విక్రయించింది. దాదాపు 9వేలకోట్ల రూపాయల విలువైన 1.5శాతం వాటాను బల్క్ డీల్ కింద విక్రయించింది. 5.9 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చి మరీ ఈ విక్రయం చేపట‍్టడం గమనార్హం. గుదిబండలా మారిన అప్పులను తీర్చడం కోసం, ఆటో, స్టీల్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కోసం రూ.8,127 కోట్ల సమీకరణే లక్ష్యంగా సోమవారం ఈ సేల్ చేసింది.
గత దశాబ్దకాలంలో తొలిసారిగా ఇదే అతిపెద్దవిక్రయమని మార్కెట్‌వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్ వాటా విక్రయం బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకున్న సామెతలాగే అవుతుందని ఎనలిస్టుల అంచనా. పెద్ద మొత్తంలో వాటాను అమ్మి మరో కొత్త అవకాశాలకోసం ఎదురు చూస్తున్న వ్యూహం బెడిసికొడుతుందనే సందేహాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టాటా సన్స్ మొత్తం డివిడెండ్ ఆదాయంలో టీసీఎస్ 92శాతం వాటా. అలాగే కార్యకలాపాల మొత్తం ఆదాయంలో 86 వాటాను టీసీఎస్ సొంతం. మరోవైపు ప్రమోటర్ ద్వారా వాటాల విక్రయం ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారి తీసింది. ఇలాంటి అమ్మకాలలో ఆఖరిది కాకపోవచ్చనే ఆందోళన నెలకొంది. దీంతో మంగళారం మార్కెట్‌లో టాప్ లూజర్‌గా నిలవగా, బుధవారం స్వల్ప నష్టాల్లో ఉంది.
కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో 6,853 కోట్ల రూపాయల విలువైన డివిడెండ్లను టాటా సన్స్ టీసీఎస్‌నుంచి అందుకుంది. అంతేకాకుండా గత జూన్‌లో ఐటి సేవల కొనుగోలులో రూ .10,278 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. కానీ 2.6 బిలియన్ డాలర్ల ఈ భారీ ప్రవాహాలు అప్పుల తీర్చడానికి పరిపోలేదు. జప ాన్ టెలికాం దిగ్గజమైన డొకొమోతో 2013లో విడిపోయిన తర్వాత.. సంస్థకు టాటా సన్స్ 127 కోట్ల డాలర్లను చెల్లించింది. అంతేగాకుండా టాటా టెలీ సర్వీసెస్ వల్ల మూటగట్టుకున్న రూ.35 వేల కోట్ల అప్పులనూ తిరిగి చెల్లించేందుకు టాటా సన్స్ అంగీకరించింది. ఇంత భారీ ప్రవాహం తరువాత కూడా అప్పుల కుప్పభారీగానే ఉంది.మరోవైపు పాటు దివాలా తీసిన భూషణ్ స్టీల్, భూషణ్ స్టీల్ అండ్ పవర్‌లను చేజిక్కించుకోవాలనుకుంటున్న టాటా స్టీల్‌కు ఆర్థిక చేయూతనిచ్చేందుకూ టాటా సన్స్ ఒప్పందం చేసుకుంది. అలాగే టాటా గ్రూపులో మరో కీలకమైన సంస్థ టాటా మోటార్స్ కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ లాంటి వాహనాల ప్రతిపాదిత కొనుగోళ్లు విలువను సృష్టిస్తే పరవాలేదు...లేదంటే ఈ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్‌గానే నిలుస్తుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment