
భారీగా పెరిగిన ఇంధన ధరలు అటో రంగ రికవరీ మరింత ఆలస్యం చేస్తాయని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. బీఎస్-VI సంబంధిత వ్యయ ద్రవ్యోల్బణం, ఇంధన ధరల హెచ్చు తగ్గులు వినియోగదారుల ప్రాధాన్యతలను మరింత ప్రభావితం చేస్తాయి. అయితే ద్విచక్రవాహనాలకు మాత్రం డిమాండ్ కొనసాగుతుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.
ఇటీవలి పరోక్ష పన్నుల పెరుగుదలతో మొదటిసారిగా డీజిల్ ధరలు... పెట్రోల్ ధరలతో సమానంగా పోటీపడి పెరుగుతున్నాయనే ఈ సందర్భంగా బ్రోకరేజ్ సంస్థ గుర్తు చేసింది. పెట్రోల్, డీజిల్ మధ్య 2012 జూన్‌లో వ్యత్యాసం రూ.32లుగా ఉండేంది. 2015 జూలైలో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం రూ.21కి తగ్గించింది. ప్రస్తుతం సమానంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే డీజీల్‌తో నడిచే వక్తిగత వాహన పరిశ్రమకు డిమాండ్ భారీగా తగ్గిందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది.
వినియోగదారు ప్రాధాన్యత అనే అంశం ‘‘ఇంధనాల మధ్య ధరల అంతరం, యాజమాన్యం మొత్తం వ్యయం’’ అధిక సంబంధాన్ని కలిగి ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.
ఈ 3షేర్లపై బుల్లిష్ వైఖరి
మోతీలాల్ ఓస్వాల్ అటో సెకార్ట్ నుంచి 3షేర్లపై బుల్లిష్ వైఖరిని కలిగి ఉంది. ఈరంగంలో లార్జ్ క్యాప్ కంపెనీలైన మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటర్స్ షేర్లకు సిఫార్సు చేయగా, మిడ్-క్యాప్ రంగం నుంచి మదర్‌సన్ సుమీ షేరు రికమెండ్ చేస్తోంది. డిమాండ్ రికవరీ పరంగా అధిక విజిబిలిటీ, బలమైన పోటీత్వం స్థాయి, బలమైన బ్యాలెన్స్ షీట్ కలిగి ఉండటంతో ఈ కంపెనీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది
Comments
Please login to add a commentAdd a comment