‘బంగారానికి వెండి ఉచితం’ | GRT Jewellers Golden celebrations with silver surprises | Sakshi
Sakshi News home page

‘బంగారానికి వెండి ఉచితం’

Published Fri, Oct 18 2024 12:27 AM | Last Updated on Fri, Oct 18 2024 7:50 AM

GRT Jewellers Golden celebrations with silver surprises

హైదరాబాద్‌: జీఆర్‌టీ జ్యువెలర్స్‌ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దీపావళికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. బంగారు ఆభరణాల బరువుకు సమానమైన వెండిని పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. వజ్రాలపై ప్రతి క్యారెట్‌కు 25 గ్రాముల వెండి, అన్‌కట్‌ డైమండ్స్‌పై క్యారెట్‌కు 2 గ్రాముల వెండి, ప్లాటినం ఆభరణాల బరువుకు సమానమైన వెండి ఉచితంగా పొందవచ్చు. 

అలాగే వెండి వస్తువుల మేకింగ్‌ చార్జీలపై 25% తగ్గింపు, వెండి ఆభరణాలు, గిఫ్ట్‌ ఆర్టికల్స్‌ గరిష్ట విక్రయ ధరపై 10 శాతం తగ్గింపు ఇస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని అన్ని షోరూమ్‌ల్లో ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఈ పండుగ సీజన్‌లో ‘బంగారానికి వెండి ఉచితం’ ఆఫర్‌ కస్టమర్లకు మరింత ఆనందాన్ని అందిస్తుందని జీఆర్‌టీ జ్యువెలర్స్‌ ఎండీ ఆనంద్‌ అనంత పద్మనాభన్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement